జయంతి వేడుకల్లో పాల్గొన్న ప్రభుత్వ విప్ అడ్లూరీ లక్ష్మణ్ కుమార్!!
ధర్మపురి నేటి ధాత్రి
అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన మహనీయుడు మహాత్మ జ్యోతిరావ్ పూలే, అని జయంతి వేడుకల్లో పాల్గొన్న ప్రభుత్వ విప్ అడ్లూరీ లక్ష్మణ్ కుమార్ అన్నారు
మహాత్మ జ్యోతిరావ్ పూలే జయంతి వేడుకలను గురువారం రోజున ధర్మపురిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ విప్ ధర్మపురి శాసన సభ్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆద్వర్యంలో ఘనంగ నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా మహాత్మా జ్యోతిరావ్ పూలే చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.మహాత్మా
జ్యోతీరావ్ పూలే అంటరానితనం, కులవ్యవస్థ నిర్మూలనతో పాటు మహిళోద్ధరణకు కృషి చేసాడని.అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పనిచేసిన మహనీయుడిని,వారి సతీమణి సావిత్రిబాయి పూలే కూడా భారతదేశంలో మహిళా విద్యకు మార్గదర్శకురాలిగా,మొట్ట మొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా, నిలిచారని, భారతదేశ బాలికల కోసం పాఠశాల ప్రారంభించిన మొట్టమొదటి వారు జ్యోతి రావ్ పూలే,సావిత్రిబాయి పూలే గారని,వారిని స్ఫూర్తిగా తీసుకొని వారు చూపిన బాటలో ప్రతి ఒక్కరు నడవాలని ఈ సందర్భంగా తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు వేముల రాజేష్,జిల్లా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు చిలుముల లక్ష్మణ్,మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాందెని మొగిలి,రాజయ్య,పోచయ్య,పురుషోత్తం,లక్ష్మణ్,శ్రీనివాస్,తిరుపతి,రాజేష్, భరత్,గణేష్,ప్రశాంత్,నరేష్ మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు,
అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన మహనీయుడు మహాత్మ జ్యోతిరావ్ పూలే!!
