మేడిగడ్డ నిరుపయోగం, 94 వేల కోట్ల వడ్డీ కడుతున్నాం, మంత్రి ఉత్తంకుమార్.

ప్రభుత్వం అధికారం చేపట్టిన 10 రోజులకే మేడిగడ్డపై ఎన్ డి ఎస్ ఏ ,తో విచారణ.

ఎన్నికల కోడ్ వల్ల మేడిగడ్డ పై ఫోకస్ పెట్టలేకపోయాం, ఇప్పుడు అంతా ఫాస్ట్ ట్రాక్ లో పనులు.

టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే గ్యారేజ్ కూలిపోయింది.

ఏడవ బ్లాక్ లో చేపట్టే పనులను క్షుణంగా పరిశీలించిన మంత్రి.

ఎం డి ఎస్ ఏ సూచన అనుసారం మేడి గడ్డ మ్యారేజ్ ను తిరిగి సస్యశ్యామలంగా కొనసాగిస్తాం.

సుందిళ్ల బ్యారేజ్ లో నిర్మాణ సంస్థకు వార్నింగ్ వారం రోజుల్లో పనులు పూర్తి చేయాలి.మంత్రి

మంత్రి ఎమ్మెల్యేలకు స్థానిక అధికారులు స్వాగతం.

మహాదేవపూర్ -నేటి ధాత్రి:

తెలంగాణ రాష్ట్ర ప్రజల 94 కోట్ల రూపాయల సొమ్మును వెచ్చించి టిఆర్ఎస్ ప్రభుత్వం కట్టిన మేడిగడ్డ బ్యారేజ్ నీరు ఉపయోగంగా నేడు మారిందని వాటికి వడ్డీలు కట్టడం జరుగుతుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. నేషనల్ డ్యాం సెక్సీ అథారిటీ ఏప్రిల్ 21 నుండి ప్రారంభించిన న్యాయ విచారణ కాలేశ్వరం ప్రాజెక్ట్ కు సంబంధించి మూడవ దశ విచారణలో భాగంగా రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి తో పాటు భూపాలపల్లి గండ్ర సత్యనారాయణ. ఎం ఎల్ ఏ మాణిక్ ఠాకూర్ అని పి ఎం సి జీవన్ రెడ్డి. ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్. ఈఎన్సి నాగేందర్ తో పాటు చీఫ్ ఇంజనీర్ సుధాకర్ అలాగే నిర్మాణ సంస్థ ఎల్.ఎన్.టి ప్రతినిధులతో సమీక్ష సమావేశాన్ని మేడిగడ్డ లక్ష్మి గ్యారేజ్ వద్ద ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నీరు అందిస్తామని 94 వేల కోట్లు రాష్ట్ర ప్రజలపై భారం మోపి నేడు మేడిగడ్డ బ్యారేజ్ ను కుంగిపోయి పరిస్థితికి తీసుకురావడం జరిగిందని, టిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనే గ్యారేజ్ కుంగిపోయినప్పటికీ కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించడం గ్యారేజ్ స్థితిగతులను అధ్యయనం చేసి మరమ్మతు పనులు చేపట్టాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరితో మేడిగడ్డ ప్రాజెక్టులోని బ్యారేజీలు దెబ్బ తినడం జరిగిందని మంత్రి ఉత్తంకుమార్ అన్నారు.

డిసెంబర్ 7న కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టగానే మేడిగడ్డపై సమావేశం ఏర్పాటు చేసి జారీ మరమ్మత్తు విషయంలో పార్లమెంట్ చట్టం ద్వారా ఏర్పడిన ఎన్ డి ఎస్ ఏ కు ప్రభుత్వం బ్యారేజ్ స్థితిగతులకు సంబంధించి కోరడం జరిగిందని అన్నారు. కాలేశ్వరం పునరుద్ధరణ కొరకు ఏలాంటి చర్యలు చేపట్టాలని వివరించాలని వారికి ప్రత్యేకంగా ప్రభుత్వం నుండి కోరడం జరిగిందని మంత్రి తెలిపారు. ఇండియాస్తే ఇచ్చిన ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో పనులను కొనసాగించడం జరుగుతుందని మంత్రి స్పష్టం చేశారు. గత ప్రభుత్వం హయాంలో మేడిగడ్డ బ్యారేజ్ లోపాలు తెలిసినప్పుడు దిగువకు మీరు వదిలిపెట్టి ఉంటే బ్యారేజ్ పరిస్థితి ఇంతవరకు రాకుండా ఉండేది కాదని నిపుణుల కమిటీ తీర్చి చెప్పిందని మంత్రి అన్నారు. అలాగే వర్షాకాలం మాన్సూన్ లకు సంబంధించి బ్యారేజ్ ప్రొటెక్షన్ పనులను కూడా చేపట్టాలని ఎన్ డి ఎస్ ఏ సూచించడం జరిగిందని అన్నారు. వాటితో పాటు గేట్లను తెరిచి పెట్టవలసిన అవసరం ఉంటుందని నిపుణుల బృందం స్పష్టం చేసిందని, కెసిఆర్ తమ అతిక తెలివితేటలను ప్రదర్శిస్తూ అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు నీళ్లను పంపిణీ చేయడం వల్ల బ్యారేజ్ మరింత డ్యామేజ్ కు దారితీసిందని, కేవలం ఎగువకు నీరు వదలడమే మేడిగడ్డ బ్యారేజ్ చెక్కు చెదరకుండా ఉండేదని స్పష్టం చేశారు.

నేషనల్ డ్యాన్స్ చేసి అథారిటీ ఇచ్చిన ఆదేశాల అనుసారం ప్రభుత్వం మేడిగడ్డ అన్నారం బ్యారేజీలను వారి సూచనల మేరకు పనులు చేపట్టడం వాటి పురోగతికి సంబంధించి పర్యవేక్షణ చేస్తూ మరమ్మత్తు పనులు వేగవంతం చేయడం జరుగుతుందని మంత్రి ఉత్తంకుమార్ అన్నారు. సుందిళ్ల బ్యారేజ్ నవయుగ నిర్మాణ సంస్థ వారి యొక్క ఖర్చులతోనే టెస్టింగ్ ఇతర ప్రక్రియలను ప్రారంభించడం జరిగిందని వాటికి సంబంధించిన పనులను ఈరోజు పనుల పురోగతిపై ఇరిగేషన్ మరియు నిర్మాణ సంస్థలతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని ఉత్తంకుమార్ అన్నారు. మేడిగడ్డ అన్నారంలో జరుగుతున్న మరమ్మతు పనులకు కాస్త సంతోషాన్ని కలిగించిందని పనుల పురోగతిపై మరింత వేగం పెంచాలని వారికి ఆదేశించడం జరిగిందని మంత్రి అన్నారు. సుందిళ్ల బ్యారేజ్ పనులకు సంబంధించి పనుల్లో జాప్యం చేయడం వల్ల నిర్మాణ సంస్థకు పనుల పురోగతి పెంచాలని వార్నింగ్ ఇవ్వడం జరిగిందని అన్నారు. అనంతరం మంత్రి మరియు ఇతర ఎమ్మెల్యేలు కలిసి మేడిగడ్డ ఏడవ బ్లాక్ ఎనిమిదవ బ్లాక్ లోని పిల్లర్ల పనులను పర్యవేక్షించారు. 15 16 17 18 19 20 21 22 ఏడవ బ్లాక్ కు సంబంధించిన పిల్లర్ల గ్రౌటింగ్ పనులను మంత్రి క్షుణంగా పరిశీలించడం జరిగింది. నిర్మాణ సంస్థ ఇంజినీర్లతోపాటు ఇరిగేషన్ శాఖ ఇంజనీర్లు మంత్రికి పనులకు సంబంధించిన వివరాలను తెలపడం జరిగింది.

నేషనల్ డ్యాం సెక్యూరిటీ ఇచ్చిన ఆదేశాలను సూచనలను ఎల్ ఎన్ టి నిర్మాణ సంస్థ ప్రతినిధి వివరించడం జరిగింది.
వర్షాలకు ముందు బ్యారేజ్ సేఫ్టీ కొరకు చేయాల్సిన పనులు జియో టెక్నాలజీ జియో ట్యూబ్ లకు సంబంధించి ఇన్ డీఎస్సీ సూచనలు పిచ్చి తక్షణమే అమలు చేయాలని చెప్పడం జరిగిందని అన్నారు. జి ఆర్ పి టెస్ట్ పిల్లర్ల కింద ఉన్న మట్టి లోపటి జియాలజీ వ్యవహారం బ్యారేజ్ కు వాడిన పైల్స్ వాటి యొక్క వివరాలు ఇంటిగ్రేటెడ్ పరీక్ష నిర్వహించి వివరాలను అందించాలని, అంతేకాకుండా ఎన్డీఎస్సీ ఆదేశాల వరకు గేట్లను ఎత్తివేసి ఉంచాలని చెప్పడం జరిగిందని అన్నారు. నీది గడ్డ అన్నారం లో ఇప్పటికి మరమ్మత్తు పనులు పెద్ద మొత్తంలో జరిగాయని ప్రతినిధులు చెప్పడం జరిగింది. వచ్చే వర్షాకాలం సీజన్ నాటికి ఎన్డిఎస్సే ఆదేశాలతో మేడిగడ్డ కన్నెపల్లి నుండి పంప్ హౌస్ నుండి పంపు చేయవచ్చు కానీ కన్నేపల్లి రెగ్యులేటర్ హీట్ కావడంతో కన్నెపల్లి వద్ద ఐదు మీటర్ల జియో టీవీలను ఏర్పాటు చేస్తే పంపింగ్ కొరకు సులువుగా ఉంటుందని చెప్పడం జరిగింది. అన్నారం సుందిళ్ల గ్యారేజ్లో 11 మీటర్ల నీళ్లను ఆపాచి వస్తుందని ఎల్లంపల్లి వరకు పంపిణీ చేసుకునే అవసరం ఉంటుందని, నెక్స్ట్ వర్షాకాలంలో సంథింగ్ చేసుకునే అవకాశం ఉందని వారు తేల్చి చెప్పారు. మేడిగడ్డలో ప్రస్తుతం ఎల్ ఎన్ టి సంస్థ మేడిగడ్డ లోని ఏడవ బ్యారేజీలో పనులను వేగంగా నిర్వహిస్తున్నామని 41 స్టాప్ 150 వర్కర్స్ 81 వెహికల్స్లను ఏంటి సంస్థ ఏర్పాటు చేసి ఏడవ బ్లాక్ కు సంబంధించి 90% పనిని పూర్తి చేయడం జరిగిందని చెప్పారు. స్వీట్ ఫైల్ అమర్చడంతోపాటు మట్టి తీసివేయడం డ్రిల్లింగ్ లాంటి పనులను 60 శాతం వరకు పూర్తి చేశామని , అలాగే పలు పరీక్షలను కొనసాగించడం కూడా జరుగుతుందని బ్లాక్ ఏడవలో ఇబ్బందులు లేకుండా పనులను కొనసాగిస్తున్నామని నిర్మాణ సంస్థ ఎల్ఎన్టి ప్రతినిధులు వివరించడం జరిగింది.

మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి తో పాటు పలు ఎమ్మెల్యేలు మేడిగడ్డ సమావేశానికి రావడంతో స్థానిక ప్రజా ప్రతినిధులు ఎంపీపీ రాణి బాయ్, జడ్పిటిసి గుడాల అరుణ, ఎంపీటీసీలు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అక్బర్ ఖాన్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కోట రాజబాబు, మంత్రి ఎమ్మెల్యేలకు పుష్ప గుచ్చాలను అందించి స్వాగతం పలికారు. అలాగే మండలానికి సంబంధించిన పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *