375వ సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలు
వీణవంక, ( కరీంనగర్ జిల్లా) నేటి ధాత్రి :
వీణవంక మండల పరిధిలోని పోతిరెడ్డిపల్లి గ్రామంలో కౌండిన్య కల్లు గీతా పారిశ్రామిక సహకార సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలు జరుపు కోవడం
సందర్బంగా సంఘం అధ్యక్షులు మాట్లాడుతూ, సర్దార్ సర్వాయి పాపన్న 375వ జయంతి వేడుకలు జరుపుకొని కేక్ కట్ చేసి స్విట్స్ పంపిణీ చేసి అనంతరం వారి ఆశయాలను స్మరిచుకుంటూ సర్దార్ సర్వాయి పాపన్న బహుజన పోరాట యోధుడు మొగాలాయ్ దౌర్జన్యలను ఎదురించి తెలంగాణ హక్కులను కాపాడిన యుద్ధ వీరుడు అని కొనియాడారు ఈ కార్యక్రమంలో గౌడ సంఘం అధ్యక్షులు చేపూరి మొగిలి, ఉపాధ్యక్షులు రాపర్తి సతీష్, కార్యదర్శి తాళ్ళపల్లి పెల్లి రాజు, డైరక్టర్స్ గౌడ కులస్తులు పాల్గొన్నారు.