పట్ట పగలే విచ్చలవిడిగా ఆటో ల్లో తరలిస్తున్న మద్యం

పట్టించుకోని ఎక్సైజ్ అదికారులు….

పెరుకే కిరాణం అమ్మేది మాత్రం మద్యం….

గ్రామాల్లో బెల్ట్ షాపుల జోరు…

పల్లెల్లో బార్లను తలపిస్తున్న బెల్ట్ షాపులు…

నిబంధనలకు విరుద్ధంగా సిండికేట్ అయిన కారేపల్లి బార్ షాప్ ల యాజమాన్యం …..

కారేపల్లి నేటి ధాత్రి

వైన్స్ షాపుల యాజమాన్యాలు సిండికేట్ గా ఏర్పాటయ్యి విచ్చలవిడిగా బెల్ట్ షాపుల దందా కొనసాగిస్తున్న పరిస్థితి కారేపల్లి మండల కేంద్రంలో నెలకొన్నది.గతంలో ఉన్న వాటి కంటే రెట్టింపు సంఖ్యలో బెల్టుషాపుల ఏర్పాటుతో వైన్స్ షాపుల యజమానులు జేబులు నింపుకుంటున్నారని మండల ప్రజలు వాపోతున్నారు. కారేపల్లి మండల కేంద్రంలోని వైన్ షాపుల టెండర్ దారులు సిండికేట్ గా ఏర్పాటయ్యి బెల్టుషాపుల దందాను కొనసాగిస్తూ మద్యం ప్రియుల జేబులను గుళ్ళ చేస్తున్నారని వైన్ షాపులు మండల కేంద్రంలో ప్రభుత్వ అనుమతి పొందినవి రెండు వైన్సులు ఉండగా కారేపల్లి మండల కేంద్రనికి దూరంగా ఉండే గ్రామాల్లోని మద్యం ప్రియులకు బెల్టుషాపులే గతవుతున్నాయనీ దీనితో వారు బెల్టుషాపులను ఆశ్రయించడం వలన బ్రాండ్ ను బట్టి రూ.20 నుండి రూ.30 ఫుల్ బాటిల్ కు రూ.50 నుండి రూ.100 వరకు అదనంగా వసూలు చేస్తున్నట్లు ప్రజలు ఆరోపిస్తున్నారు.అధిక రేటుపై ప్రశ్నించిన ప్రజలపై దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఇదిలా ఉండగా బెల్ట్ షాపులవారికి వైన్ షాప్ యాజమానులు క్వార్టర్ కు రూ.10, ఫుల్ బాటిల్ కు రూ.40 వరకు అధికంగా వసూలు చేస్తున్నారని ధరలను ప్రశ్నించిన మద్యం ప్రియులపై ఆగ్రహం చూపిస్తూ ధరలు అదేవిధంగా అమ్ముతామని అంటున్నారని మద్యం ప్రియులు వాపోతున్నారు.
పెరుకే కిరాణం.అమ్మేది మాత్రం మద్యం.సింగరేణి మండలం లోని పలు గ్రామాలలో ఎక్కువ మంది పేరుకు కిరాణా దుకాణాలుగా నిర్వహిస్తూ లోపల మాత్రం మద్యం వ్యాపారం చేస్తున్నారనీ సొంత ఇళ్లల్లో పెద్ద పెద్ద ఫ్రిజ్జులు పెట్టుకొని మరీ విక్రయిస్తున్నారని బెల్ట్ షాపులవారికి వైన్ షాపుల యజమానులు ఆటోల ద్వారా మధ్యాన్ని ఊరూరా సరఫరా చేస్తున్నారని అన్నారు.వైన్ షాపు నిర్వాహకులు బెల్ట్ శాపులవారికీ గ్రామాలకు నిత్యం ఆటోల్లో పంపించి అమ్మిస్తున్నారని అంటున్నారు.మద్యం మత్తులో ఇండ్ల మధ్యలో గొడవలు పడుతూ అర్ధరాత్రి వరకు నానా రభస చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.పచ్చని సంసారాల్లో మద్యం చిచ్చు విచ్చలవిడిగా గ్రామాల్లో దొరుకుతున్న మద్యం పచ్చని సంసారాల్లో చిచ్చులు పెడుతున్నాయని మండలంలోనీ ప్రతి గ్రామంలో బెల్ట్ షాపులు పుట్ట గొడుగులవలె వెలుస్తున్నాయనీ దీంతో పొద్దంతా పనిచేసి సంపాదించిన సొమ్మును మద్యానికి వెచ్చిస్తూ కుటుంబాలను వీదిన పడేస్తున్నారనీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న మహిళలు.గ్రామాల్లో బెల్ట్ షాపులు నిర్వహిస్తుండడంతో యువత పెడదారి పడుతు మద్యం మత్తులో బైక్ యాక్సిడెంట్స్ అయ్యి జీవితాలను మధ్యంతరంగా చాలిస్తున్నారని ఈ విషయాన్ని సంబంధిత ఎక్సైజ్ అధికారులు చూసి చూడనట్టు వదిలేయడంపై ప్రజల్లో అధికారులపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న ప్రజలు.ఎక్సైజ్ అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారన్న ఆరోపణలు ప్రజల్లో వినిపిస్తున్నాయి.
బెల్ట్ షాపులను ప్రోత్సహిస్తున్న ఎక్సైజ్ అధికారులు…!
ఎక్సైజ్ అధికారులు వైన్స్ షాపుల వైపు అసలు కన్నెత్తి చూడడం లేదనీ నెల నెల వారికి మామూళ్లు వైన్స్ షాపుల నుండి అందుతున్నాయని దీనితో వారు ఇటువైపే రావడం లేదని మండల ప్రజలు అంటున్నారు.ఎక్సైజ్ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకొకపోవడం వలన వైన్స్ షాపు యజమానులు సిండికేట్ అయ్యి ఇష్టారీతిన బెల్టు షాపులకు మద్యాన్ని ఆటోల్లో సరఫరా చేస్తున్నారని స్వయంగా ఎక్సైజ్ అధికారులే ఈ వ్యాపారాన్ని ప్రోత్సహిస్తున్నారని ప్రజలు అంటున్నారు.
బెల్టు షాపులతో గ్రామాల్లో నేరాలు..!
గ్రామాల్లో బెల్టుషాపుల నిర్వహణతో 18 సంవత్సరాలు నిండని యువకులు మద్యానికి బానిసై వారి భవిష్యత్తును అంధకారం చేసుకుంటున్నారు కూలి పనులు చేసుకునే వారు వారికి పనిచేస్తే వచ్చే డబ్బులను బెల్టు షాపుల్లో మద్యానికే వేచ్చించడంతో వారి కుటుంబంలో గొడవలు వస్తున్నాయంటున్నారు. బెల్టుషాపులతో దొంగతనాలు నేరాలు పెరుగిపోతున్నాయంటున్నారు.ఇప్పటికైనా ఎక్సైజ్ అధికారులు ఈ సిండికేట్ దందాకు చెక్ పెట్టి వైన్స్ షాపులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *