పేదలందరికీ ఇండ్లు ఇండ్ల స్థలాలు ఇవ్వాలి
తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు గంగాపురం మహేందర్ డిమాండ్
రఘునాథపల్లి( జనగామ) నేటి ధాత్రి :-
మండలంలోని ఎల్లారెడ్డిగూడెంలో ఉపాధి కూలీలను కలిసి వారు సమస్యలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ మండుటెండలో పనిచేస్తున్న కూలీలకు కనీస సౌకర్యాలు కూడా లేవని ఆయన అన్నారు గతంలో ఇచ్చినట్లు కూలీలకు పేస్లిపులు ఇవ్వాలని ప్రమాదం జరిగితే తాత్కాలిక ట్రీట్మెంట్ చేయడానికి జిల్లాలోని అన్ని పని ప్రదేశాల్లో మెడికల్ కిట్టు అందుబాటులో ఉంచాలని అలాగే ప్రభుత్వ భూములను పేదలకు పంచాలని పేదల గుడిసెలు వేసుకున్న చోట పట్టాలు ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానం ప్రకారం పక్కా ఇల్లు కట్టించాలని ఇంటి స్థలం లేని వారికి ఇంటి స్థలం ఇచ్చి ప్రభుత్వం పక్కా ఇల్లు కట్టించాలని వారన్నారు పని ప్రదేశంలో ఉపాధి కూలీలకు ఏవైనా ప్రమాదం జరిగితే ఐదు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇచ్చి ఆదుకోవాలన్నారు కేరళ రాష్ట్రంలో ఇస్తున్నట్లు ఉపాధి కూలీలకు ఉపాధిహామీ వందరోజుల పని దినాన్ని 200 పెంచుతూ రోజువారి వేతనం ఎలాంటి కొలతలు లేకుండా 800 రూపాయలకు పెంచాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు పై సమస్యల పరిష్కారం కోసం రేపు జరగబోయే కలెక్టరేట్ ధర్నాను జయప్రదం చేయాలని ఆయన ఉపాధి కూలీలకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సింగిరెడ్డి మల్లారెడ్డి పెంతల ఎల్లయ్య మూసుకు నరసయ్య కూస ఉప్పలయ్య కూస రాములు గోనె ప్రేమ లత బైరగోని రుక్కమ్మ బొమ్మెర ధనలక్ష్మి కూసా కమలమ్మ కూస శోభ ఎర్ర నాగలక్ష్మి కూరపు నర్సింగం తదితరులు పాల్గొన్నారు.