Call for Telangana Activists Meet
ఉద్యమకారుల ఆత్మగౌరవ సదస్సును జయప్రదం చేద్దాం.
ప్రభుత్వం కంటే ఉద్యమకారుల త్యాగాల గుర్తింపుకే ప్రాధాన్యత
సూర్యాపేట జిల్లా అధ్యక్షులు గుండె పంగు రమేష్
కోదాడ, నేటి ధాత్రి:
ఏకమవుతున్న తెలంగాణ ఉద్యమకారుల విస్తృత సమావేశానికి నేడు చలో హైదరాబాద్ తెలంగాణ ఉద్యమకారుల విస్తృత స్థాయి సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరుతూ శుక్రవారం కోదాడ పట్టణంలోని హుజూర్నగర్ రోడ్ అమ్మ మెడికల్ ఏజెన్సీ వద్ద కోదాడ నియోజకవర్గం తెలంగాణ ఉద్యమకారుల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం సూర్యపేట జిల్లా అధ్యక్షులు గుండెపంగు రమేష్ మాట్లాడుతూ. ప్రభుత్వం కంటే ఉద్యమకారుల త్యాగాల గుర్తింపుకే ప్రాధాన్యతగా నేడు జరగబోయే హైదరాబాద్ లోని తార్నాక మర్రి కృష్ణారెడ్డి ఫంక్షన్ హాల్ నందు నిర్వహించబోయే తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల ఫోరం సభను కోదాడ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమకారులకు పిలుపునిస్తూ నియోజకవర్గంలోని ప్రతి మండలాల గ్రామాల నుంచి తెలంగాణ ఉద్యమకారులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కోదాడ మండల అధ్యక్షులు కోళ్లూరి వెంకటేశ్వర్లు, మునగాల మండల అధ్యక్షులు పోలంపల్లి వెంకటేశ్వర్లు, అనంతగిరి మండల అధ్యక్షులు ధారావత్ సైదులు, తొలి దశ మలిదశ ఉద్యమకారులు ఏనుగుల యల్లేశ్వరరావు, మట్టపల్లి శ్రీనివాస్ గౌడ్,ఎస్ కే మీరా, బొమ్మకంటి వీరబాబు, కరుణాకర్, మండవ నాగేశ్వరరావు బొంత శివాజీ, ముక్కు రాములు,ఆదిమల్ల రాజశేఖర్, రాజు, ఆనంద్, గోపికృష్ణ, సైదులు, సత్యనారాయణ, ఎండి హుస్సేన్ అలీ, సుదర్శన్, తిరుమలరావు, బాలిబోయిన ఏడుకొండలు, కే నాగేశ్వరరావు,తదితరులు పాల్గొన్నారు.
