
వనపర్తి నేటిదాత్రి
ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య 105 అనుసరించి అన్ని నిబంధనలు పాటిస్తేనే లే అవుట్ లు ఆమోదం పొందుతాయని అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ సంచిత్ గంగ్వార్ అన్నారు.
శనివారం ఉదయం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లాస్థాయి లే-అవుట్ కమిటీ సమావేశం జరిగింది టి ఎస్ బి పి ఏ ఎస్ ఎస్
ద్వారా మొత్తం 6 దరఖాస్తులు రాగా వాటిని కమిటీ ద్వారా క్షుణ్ణంగా పరిశీలిం చారు అన్ని నిబంధనలకు లోబడి ఉన్న లే అవుట్లను ఆమోదించి నిబంధనలు లేని వాటిని కమిటీ ద్వారా అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ తిరిగి పంపించారు.
రోడ్లు, భవనాల శాఖ, పంచాయతీ రాజ్, ఇరిగేషన్, విద్యుత్తు, రెవెన్యూ అధికారులతో కమిటీలో నిబంధనల ప్రకారం ఎలాంటి సౌకర్యాలు లే అవుట్లో ఉన్నాయో పరిశీలిం చారు
నిబంధనల ప్రకారం అంతర రోడ్లు, గ్రీనరి, మొక్కలు, ఎవెన్యు ప్లాంటేషన్, ఓవర్ హెడ్ ట్యాంకులు, విద్యుత్ ట్రాన్స్ఫార్మర్, డ్రైన్ , సెప్టిక్ ట్యాంక్ , మాస్టర్ ప్లాన్, అప్రోచ్ రోడ్డు తదితర మొత్తం 18 రకాల సౌకర్యాలు అందుబాటులో ఉన్నయో లేవో పరిశీలించి కమిటీ నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఈ సమావేశంలో ఈ. ఈ పంచాయతీ రాజ్ మల్లయ్య, రోడ్లు భవనాలు శాఖ ఈ . ఈ దేశ్యనాయక్ ఇరిగేషన్ శాఖ నుండి మధుసూధన్, విద్యుత్ శాఖ నుండి వేణు, టౌన్ ప్లానింగ్ అధికారి బి. వరప్రసాద్, కొత్తకోట తహశీల్దార్ బాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.