భూపాలపల్లి నేటిధాత్రి
జిల్లా కేంద్రంలోని రవి నారాయణ రెడ్డి భవన్ లో జాతీయ సమితి సభ్యురాలుగా ఎన్నికైన పొనగంటి లావణ్య ని డిహెచ్పిఎస్ జిల్లా సమితి నాయకులు ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా పొన్నగంటి లావణ్య మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న దళిత వ్యతిరేక విధానాలపై పోరాడుతామని, దేశంలో దళితులపై అనేక దాడులు జరుగుతున్న కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడంలేదని, కేంద్రం రాజ్యాంగ వ్యతిరేక విధానాలు అవలంబిస్తుందని, రాజ్యాంగం హక్కులను పరిరక్షించుకోవడానికి కృషి చేస్తామని, రాష్ట్రంలో ప్రభుత్వ భూములలో గుడిసెలు వేసుకొని నివసిస్తున్న పేద ప్రజలు అందరికీ ప్రభుత్వం వెంటనే పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు, రాష్ట్ర ప్రభుత్వం అంబేద్కర్ అభయ హస్తం దళిత బంధు ఇప్పటివరకు కూడా ఒక్కరికి కూడా ఇవ్వకుండా కాలయాపన చేస్తుందని, ఎన్నికలలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు చేస్తామని,అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షాను కేంద్రమంత్రి పదవి నుండి వెంటనే తన పదవి నుండి భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.. లేనిపక్షంలో దేశవ్యాప్తంగా ఉద్యమాలు చేస్తామని డిమాండ్ చేశారు
ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి సోతుకు ప్రవీణ్ కుమార్ డి హెచ్ పి ఎస్ జిల్లా నాయకులు.. రాసపల్లి భద్రయ్య, నేరెళ్ల జోసెఫ్, దొంతు రవీందర్, పెద్దమాముల సంధ్య, చిట్యాల పద్మ తదితరులు పాల్గొన్నారు….