KK Mahender Reddy Press Meet on State Development
కేకే మహేందర్ రెడ్డి పాత్రికేయుల సమావేశం….
తంగళ్ళపల్లి నేటి ధాత్రి….
తంగళ్ళపల్లి మండల కేంద్రంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సిరిసిల్ల నియోజకవర్గం ఇన్చార్జి కాంగ్రెస్ పార్టీ నాయకులు కేకే మహేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులతో కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసినారు. ఈ సమావేశంలో కేకే మహేందర్ రెడ్డి మాట్లాడుతూ. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలన నచ్చి రాష్ట్రంలో మొదటి విడత జరిగిన ఎన్నికల్లో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అనుబంధంగా ఉండి చాలాచోట్ల తమ అభ్యర్థులు అత్యధిక మెజార్టీతో గెలుపొందారని.దీనికి రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి నిదర్శమనితెలియజేస్తూ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ రాష్ట్ర మహిళలకు ప్రత్యేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకువస్తూ ప్రతి మహిళ అన్ని రంగాల్లో రాణించాలని రాష్ట్రంలో మహిళలకు అభివృద్ధిలో పాలుపంచుకునే విధంగా వారికి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని గర్వంగా చెప్పుకోవడం జరుగుతుందని తెలియజేస్తూగత పాలకులు రాష్ట్రాన్ని సంవత్సరాలు పరిపాలించి అప్పులపాలుచేశారని అట్టి అప్పు చేసిన రుణాలను తీర్చుకుంటూ ఎన్ని కష్టాలు వచ్చినా రాష్ట్రాన్ని అభివృద్ధిలో తీసుకువెళ్తున్నారని ఇకముందైన ఇతర పార్టీలు ఎన్ని కల్లబొల్లి మాటలు చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని రాష్ట్రంలో ప్రజలందరూ మా పార్టీ చేస్తున్న అభివృద్ధివైపే.ఉన్నారని మా రెండేళ్ల పరిపాలనలో అభివృద్ధిని చూడలేక అనేక అబండాలువేస్తున్నారని మేము చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక పోతున్నారని అందరూ ప్రజలు గ్రహిస్తున్నారని ఎవరు అభివృద్ధి చేశారు ఎవరు రాష్ట్రాన్ని దివాలా పరిస్థితిలో ఉంచారో ప్రజలు గమనించే స్థితిలో ఉన్నారని తెలంగాణ రాష్ట్ర ప్రజలు అన్ని విషయాలు గమనిస్తున్నారని దేనికైనా నోరు ఉంది కదా అని అభివృద్ధి పదంపై నడిపిస్తున్న రేవంత్ రెడ్డి సర్కారుపై లేనిపోని అపనిందలు వేస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరని తగిన సమయంలో సరైన గుణపాఠం చెప్తారని ఇకముందైనఅభివృద్ధిని చూసిగర్వించాలి తప్ప ఎగతాళి చేయకూడదని రాష్ట్రంలో ప్రజలు ముందు జరగబోయే ఎన్నికల్లో రాష్ట్ర అభివృద్ధిని చూసి ఓటు వేసి గెలిపించాలని ఈ సందర్భంగా కేకే మహేందర్ రెడ్డి తెలియజేశారు. ఇట్టి సమావేశ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జలగం ప్రవీణ్. వ్యవసాయ కమిటీ వైస్ చైర్మన్ నేరెళ్ల నరసింహ గౌడ్.జిల్లా అధికార ప్రతినిధి లింగాల భూపతి. పెద్దూరీ.తిరుపతి. మోర లక్ష్మీరాజం. సత్తు శ్రీనివాస్ రెడ్డి. భాస్కర్ గౌడ్. బండి పరశురాం గౌడ్ ఎగుర్ల ప్రశాంత్. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నాయకులు, కార్యకర్తలు తదితరులు ఇట్టి సమావేశ కార్యక్రమంలో పాల్గొన్నారు
