వనపర్తి నేటిధాత్రి
నీట్ పరీక్ష అవకతవకలపై కేంద్ర ప్రభుత్వం విచారణ జరిపించాలని నీట్ పరీక్షలు మళ్ళీ నిర్వహించాలని తెలంగాణ జన సమితి జిల్లా అధ్యక్షులు ఏ మి ఏ ఖాదర్ పాషా డిమాండ్ చేశారు వనపర్తి లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎలాంటి హడావిడి లేకుండా సార్వత్రిక ఎన్నికలు ఫలితాలు నీట్ పరీక్ష 4 న వచ్చిన ఫలితాలలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్డీఏ ప్రకటించడం దాని వెనుక ఉన్న రహస్యం ఏమిటని ప్రశ్నించారు . 14న నీట్ పరీక్షా ఫలితాలు వెల్లడిస్తామని ప్రకటించి ఎలాంటి సమాచారం లేకుండా ముందుగా ప్రకటించడంపై దేశవ్యాప్తంగా వ్యతిరేకత రా వడంతో వెంటనే విచారణ జరిపించాలని మళ్లీ నీట్ పరీక్షలు నిర్వహించాలని ఆయన కోరారు వైద్య రంగంలో రాష్ట్ర అధారిత ఉమ్మడి పరీక్ష విధానాన్ని మార్చడం వల్ల అవినీతి అక్రమాలు జరిగాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు అవినీతికి అధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని ఖాదర్ డిమాండ్ చేశారు