కాజీపేట సిఐపై హెచ్‌ఆర్‌సిలో పిర్యాదు
తన భూమి విషయంలో కాజీపేట సిఐ అజయ్‌కుమార్ తనను బెదిరింపులకు గురిచేస్తూ తన ప్రత్యర్థులకు సహకరిస్తున్నాడని వడ్డేపల్లికి చెందిన కటకం సంపత్ గురువారం మానవహక్కుల కమిషన్‌కు పిర్యాదు చేసారు. కాజీపేట సిఐ భూకబ్జాదారులకు సహకరిస్తూ తనపై అక్రమంగా కేసులు నమోదు చేస్తున్నాడని, రౌడీషీట్ నమోదు చేస్తానని బెదిరిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. సిఐ అండతో భూకబ్జాదారులు తనను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని, సీఐ తరుచుగా ఫోన్ చేస్తూ బూతులు తిడుతూ స్టేషన్‌కు రావాలని వేధిస్తున్నాడని లేఖలో భాదితుడు సంపత్ ఆరోపించాడు. భూమి విషయంలో కోర్టు నుంచి తనకు అనుకూలంగా ఇంజక్షన్ ఆర్డర్ ఉందని సీఐకి వివరించే ప్రయత్నం చేసినా తన మాటను లెక్క చేయకుండా పోలీస్‌స్టేషన్‌కు రావాల్సిందేనని ఫోన్‌లో బెదిరిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ భూమికి సంబంధించిన వివాదం కోర్టు విచారణలో ఉందని బాధితుడు తెలిపారు.