భూపాలపల్లి నేటిధాత్రి
బహుజన సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్న కత్తి సంపత్ గౌడ్ ప్రొఫెషనల్ జయశంకర్ నేషనల్ అవార్డు ను భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలంలోని ద్వారకపేట గ్రామానికి చెందిన ఆర్.ఎం.పి, పి.ఎం.పి వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కత్తి సంపత్ గౌడ్, మహారాష్ట్రలోని పూణేలో జరిగిన కార్యక్రమంలో బహుజన సాహిత్య అకాడమీ నేషనల్ అవార్డును అధ్యక్షులు రాధాకృష్ణ చేతుల మీదుగా అందుకున్నారు. తెలంగాణ ఉద్యమం సమయంలో చేసిన సేవలను గుర్తించి అవార్డు ఇవ్వడం జరిగిందని ఆయన తెలిపారు కాగా బహుజన సాహిత్య అకాడమీ అధ్యక్షులు నల్ల రాధాకృష్ణ, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎం ఎం గౌతమ్ రాష్ట్ర కోఆర్డినేటర్ విష్ణు, అవార్డు సెలక్షన్ కమిటీ మెంబర్ వంగ కుమారస్వామిలకు కత్తి సంపత్ గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు