అడ్డుగావెళ్లిన తల్లిని మంచం పట్టేతో కొట్టిన కొడుకు
నిందితున్ని పట్టుకున్న పోలీస్ సిబ్బంది
శాయంపేట నేటి ధాత్రి:
శాయంపేట మండలం కొప్పుల గ్రామానికి చెందినదూదిపాల తిరుపతిరెడ్డిని అరెస్టు చేసి పత్రిక ముందు పెట్టడం జరిగింది.దూదిపాల తిరుప తిరెడ్డి తన గ్రామంలో మోతే జైపాల్ రెడ్డి ముందు స్థలము గుంటకు మూడు లక్షల చొప్పున ఖరీదు చేశారు ఈ భూమిలో చింత చెట్టుతో సహా అమ్ముకున్నారు . ఆ భూమిలోని చింతచెట్టును తానే కొట్టుకుంటానని జైపాల్ రెడ్డి తాను ముందుగానే ఒప్పందం కుదుర్చుకున్నారు. చెట్టును కొట్టేందుకు శనివారం మధ్యాహ్నం జైపాల్ రెడ్డి భూమి వద్దకు వెళ్ళగా తిరుపతి రెడ్డి అడ్డుకున్నాడు. దీంతో ఇద్దరు మధ్య గొడవ జరిగింది అది తీవ్రరూపం దాల్చడంతో తిరుపతిరెడ్డి భార్య నాగమణి తన భర్త అక్కడి నుంచి తీసుకెళ్లే ప్రయత్నం చేసింది కోపంతో భార్యపై చేయి చేసుకున్నాడు అది గమనించిన తల్లి అమృతమ్మ తిరుపతిరెడ్డిని అడ్డుకునే ప్రయత్నం చేయగా పక్కన ఉన్న మంచం పట్టేతో తలపై కొట్టాడు తీవ్రంగా గాయపడ్డ అమృతమ్మకు పరకాల్లో ప్రథమ చికిత్స చేయగా అక్కడి నుండి వరంగల్ ఎంజీఎంకు తరలించాడు. బిడ్డ ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేయగా తలపై బలంగా కొట్టాడని తేలింది ఇది గమనించిన పోలీస్ సిబ్బంది వెంటనే తిరుపతి రెడ్డిని అరెస్టు చేశారు తిరుపతిరెడ్డిని అడగగా కొట్టిన కర్రను వాగు పొదల్లో దాచి పెట్టడం జరిగింది. పోలీసు సిబ్బంది దానిని సేకరించి ఉంచడం జరిగింది. ఇతనిని కోర్టులో హాజరు పరచడం జరుగుతుంది.ఈ కార్యక్ర మంలో ఏసీపీ కిషోర్ కుమార్, సీఐ రంజిత్ కుమార్ ఎస్సై ప్రమోద్ కుమార్ ,పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.