ప్రారంభానికి నోచుకోని కస్తూర్భ గాంధీ బాలికల పాఠశాల

విద్యా సంవత్సరం ప్రారంభమై నెల రోజులు గడుస్తున్న ప్రారంభం కానీ తరగతులు

-బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఇంచార్జ్ గుడివాడ శ్రీహరి

మంగపేట, నేటిధాత్రి

మంగపేట మండలంలో చుంచుపల్లి లో ఉన్న కస్తూర్భ గాంధీ బాలికల పాఠశాలను మండల కేంద్రంలోని ఎంఈఓ కార్యాలయం వెనుక నూతన భవన నిర్మాణంలోకి మార్చాలని అధికారులు చూసినప్పటికీ ఇంకా పాఠశాలలో విద్య ప్రారంభం కాలేదు. అని బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఇంచార్జ్ గుడివాడ శ్రీహరి తెలిపారు .నూతన భవనంలోకి మార్చాలని ఉద్దేశంతో అధికారులు కొత్తగా ఈ ప్రాంతంలో కాక ఇతర ప్రాంతాల నుండి సుమారు 260 మంది విద్యార్థినిలు కస్తూర్బా లో చేరారు. వారు చదువుతున్న పాఠశాలలో టీసీలు తీసుకొని కస్తూర్బా పాఠశాలలో చేరారు .బాలికలు టీసీలు తీసుకోనీ కస్తూర్బా లో చేరి నెల రోజులు కావస్తున్నా నూతన భవనంలో ఇంకా తరగతులు ప్రారంభం కాలేదు. ఇప్పుడు ఎంచేయాలో అర్ధం కాక, విధ్యార్ధినిలు, వారి తల్లిదండ్రులు వారి గోడు ఎవరికి చెప్పుకోవాలో అర్ధంకాక ఆవేదన చెందుతున్నారు. చుంచుపల్లి లో ఉన్న పాఠశాలలో 60 మంది విద్యార్థినులకు మాత్రమే వసతులు ఉండడంతో పాత విద్యార్థినిలకు అక్కడ పాఠశాల బోధన జరుగుతుంది, ఇప్పుడు కొత్తగా నూతన భవనంలోకి మార్పు చేస్తామని అడ్మిషన్లు తీసుకుని కాలయాపన చేస్తున్నారు,బిల్డింగ్ పనులు పూర్తి కాలేదనీ ఆలస్యం చేస్తున్నారో లేక వసతులు టీచర్లు కొరత తో ఆలస్యం చేస్తున్నడం తెలియడం లేదు కానీ బావి భారత విద్యార్థినల భవిష్యత్తు శూన్యంగా మారింది , వెంటనే ఉన్నత అధికారులు స్పందించి కస్తూర్బాలో పాఠశాల ప్రారంభించాలి అని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *