కాలుష్య నివారణకు కృషి చేయాలి
ప్రజలందరూ కాలుష్య నివారణకు కృషి చేయాలని వరంగల్ నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ వి.రవీందర్ తెలిపారు. బుధవారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి వరంగల్ విభాగం ఆటవీశాఖ అధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి సీపీ డాక్టర్ వి.రవీందర్ జెండా ఊపి ప్రారంభించారు. హన్మకొండ పబ్లిక్‌గార్డెన్ నుండి ర్యాలీ ప్రారంభమైంది. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ డాక్టర్ వి.రవీందర్ మాట్లాడుతూ పీల్చే గాలి కాలుష్యం కావడంతో శ్వాసకోశ వ్యాధులతోపాటు ఇతర అరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని తెలిపారు. ప్రజలు పెట్రోల్, డీజిల్ లాంటి ఇంధన వినియోగాన్ని తగ్గించుకోవాలని సూచించారు. వ్యక్తిగత వాహనాల వినియోగాన్ని ప్రజారవాణా వ్యవస్థకు వినియోగించుకోవాలన్నారు. బహిరంగ ప్రదేశాల్లో చెత్తను వేయడం, కాల్చడాన్ని తగ్గించాలని తెలిపారు. భవిష్యత్తు తరాలకు కాలుష్యం లేని పర్యావరణాన్ని అందించేందుకు తన వంతు భాధ్యతగా కాలుష్య నివారణకు కషి చేస్తానని చెప్పారు. అంతేకాకుండా ముమ్మరంగా మొక్కలను నాటేందుకు సిద్దపడాలని పోలీస్ కమిషనర్ తెలిపారు.