జీవితాన్నిచ్చిన గ్రామానికి సేవచేసే అవకాశం రావడం అదృష్టం : కౌడగాని కవితరాంబాబు

కష్టపడి వృద్ధిలోకి వచ్చిన కుటుంబంలో ప్రధాన పాత్ర ఆమెది.కోట్ల రూపాయల వ్యాపార వ్యవహారాలు చూసుకునే కుటుంబంలో కీలకపాత్ర కావడంతో వ్యాపార వ్యవహారాలే కాక అదనంగా కుటుంబ బాధ్యతలు ఆమె చూసుకునేది. తీరిక లేని జీవితం. కుటుంబం,వ్యాపారాలే ప్రధాన అంశాలుగా సాగిపోతున్న కుటుంబమే అయినా అమే ఆలోచన జీవితాన్నిచ్చిన గ్రామంపై పడింది. పలు కంపనీలకు మెనేజింగ్‌ డైరెక్టర్‌గా ఉన్నప్పటికి తన బాధ్యతలను పక్కనబెట్టి పూర్తి సమయాన్ని గ్రామ అభివృద్ధికి కేటాయించి గ్రామం,గ్రామ ప్రజల ఋణం తీర్చుకోవాలనే ఉద్ధేశ్యంతో వ్యాపారవ్యవహారాలను పక్కనబెట్టి గ్రామసేవ చేయడానికి ముందుకోచ్చింది. అందుకోరకు ముందుగానే గ్రామ పరిస్థితులను అధ్యయనం చేసింది. అందు కోరకు గ్రామంలో ముందుగా నాయకులు,ప్రజల మధ్య సఖ్యతకు బాటలు వేసి విజయం సాధించింది. గ్రామంలో ప్రజలు ఎదుర్కోంటున్న ఇబ్బందులు,అవసరమైన కనీస సౌకర్యాలు,జరగాల్సి అభివృద్ధి గురించి తెలుసుకుంది.గ్రామసేవకు అమె పడుతున్న తపనను గుర్తించి ప్రజలు అమేకు ప్రథమపౌరురాలిగా పట్టంకట్టారు.పాలన బాధ్యతలు చెపట్టింది మొదలు ప్రభుత్వ నిధులు,పాలకుల సహకారం కోరకు ఎదురు చూడకుండా ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా స్థానిక ప్రజలకు అవసరమైన అన్ని కార్యమ్రాలు నిర్వహిస్తూ గ్రామ రూపురేఖలు మార్చేందుకు పాలుపడుతూ గ్రామ ప్రజల మన్ననలు పొందుతూ మరో నాలుగేళ్ళలో మా గ్రామాన్నే చూసి ఆదర్శ గ్రామానికి నిర్వచనంగా చెప్పుకోవాలనే లక్ష్యంగా ముందుకు వచ్చిన కొత్తపల్లి గ్రామ ప్రథమపౌరురాలు కౌడగాని కవితరాంబాబు తో నేటిధాత్రి ప్రత్యేక ఇంటర్వ్యూ…

నేటిధాత్రి ప్రతినిధి: గ్రామంలో ఎంతమంది జనభా ఉన్నారు, ఓటర్లు ఎంత మంది.?

సర్పంచ్‌:గ్రామంలో మొత్తం 2080 మంది జనాభా,1587 మంది ఓటర్లు ఈ గ్రామంలో ఉన్నారు.

ప్రతినిధి: పన్నుల వసూళ్ళ కార్యక్రమం ఎంత వరకు జరిగింది?

సర్పంచ్‌:ప్రస్తుతం గ్రామంలో స్థానిక సిబ్బంది,సంబంధిత అధికారులు,గ్రామ ప్రజల సహకారంతో 50 శాతం పన్నులు వసూళు చేయడం జరిగింది. పన్నుల వసూళ్ల గురించి గ్రామంలో ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది.దాని కోరకు సంబంధిత స్థానిక అధికారులు,సిబ్బందితో కలిసి ప్రత్యేక కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాం.పన్నుల చెల్లింపుల వలన జరిగే మార్పులను స్థానిక ప్రజలు గుర్తించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి.వచ్చే ఆర్ధిక సంవత్సరంలో పన్ను చెల్లింపుల్లో ప్రజలకు సంపూర్ణ అవగాహన కల్పించి వచ్చే ఆర్ధిక సంవత్సరం నుండి గ్రామంలో 100శాతం పన్నులు వసూలు చేస్తాం.

ప్రతినిధి: ఈ వేసవిలో గ్రామ ప్రజలకు నీటి సమస్యలు లేకుండా చేసేందుకు చర్యలు తీసుకున్నారా..?

సర్పంచ్‌: ప్రస్తుతానికి గ్రామంలో ప్రజలకు ఎలాంటి నీటి సమస్యలు రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం.అధే విధంగా గ్రామంలో నీటి సమస్యలు అధిగమించడానికి ముందస్తు చర్యల్లో భాగంగా అదనపు బోర్లను కూడా ఏర్పాటు చేశాం.వేసవిలో ప్రజలకు నీటి కష్టాలు రాకుండా చూసేందుకు శాయశక్తులా మా పాలకవర్గం పాటుపడుతుందనే నమ్మకం ప్రజలకు ఉంది.ప్రజలు మాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి శక్తివంచన లేకుండా పాటుపడతా.

ప్రతినిధి: గ్రామంలో మిసన్‌ భగీరథ పనులు పూర్తయ్యాయా…?

సర్పంచ్‌: గ్రామంలో మిషన్‌ భగీరథ పనులు పూర్తి కాలేదు. మిషన్‌ భగీరథ పనులు ఇప్పటికే పూర్తి అయి ఉంటే మంచినీటి విషయంలో చాలా వెసులుబాటు ఉండేది.కాని పూర్తి అవ్వలేదు. మిషన్‌ భగీరథ పనుల్లో గ్రామంలో నల్లాలు ఎర్పాటులో జాప్యం జరుగుతుంది.పనులు జరగాల్సి ఉంది. సంబంధిత అధికారులను సంప్రదించి సమస్యను వారి దృష్టికి తీసుకెళ్ళాం.వీలైనంత త్వరగా పనులు పూర్తి చేస్తామని తెలిపారు.

ప్రతినిధి: గ్రామంలో మరుగుదొడ్లు,ఇంకుడు గుంతల నిర్మాణాలు ఏ మేరకు పూర్తి అయ్యాయి.?

సర్పంచ్‌: గ్రామంలో ఇప్పటికే 70శాతం మరుగుదొడ్లు పూర్తి అయ్యాయి. మిగిలిన 30శాతం పూర్తి చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నారు.నిర్మాణాలను పూర్తి చేయడానికి ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహిస్తున్నాం.అవసరమైతే ఆర్ధిక ఇబ్బందులతో నిర్మాణాలు చేసుకోని వారికోరకు అవసరమైన ఆర్ధిక చేయూతను ఇస్తాం.అధే విధంగా ఇంకుడు గుంతల నిర్మాణం కొరకు ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. ఇంకుడుగుంతల నిర్మాణాల వలన కలిగే ప్రయోజనాలను గురించి ప్రజలకు చైతన్యం కలిగించే కార్యక్రమాలను నిర్వహించి మరుగుదొడ్లు,ఇంకుడుగుంతల నిర్మాణాలను పూర్తి చేస్తాం.

ప్రతినిధి: హరితహారం కార్యక్రమం కొరకు ఎలాంటి ప్రణాలికలు సిద్ధం చేసుకున్నారు.?

సర్పంచ్‌: నూతన పంచాయితిరాజ్‌ చట్టంలో హరితహారం కార్యక్రమానికి ప్రత్యేకస్థానం ఉంది. హరితహారం కార్యక్రమం కోరకు ఇప్పిటికే గ్రామంలో ప్రత్యేక నర్సరీని ఏర్పాటు చేయడం జరిగింది. నర్సరీలో మొక్కలు సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం.అధే విధంగా గ్రామంలో హరితహారం కార్యక్రమం కొరకు గ్రామం ప్రారంభం దగ్గర నుండి చివరి వరకు రోడ్లకు ఇరువైపులా ఉన్న పిచ్చి మొక్కలను తొలగిస్తున్నాం. అధే విధంగా గ్రామం మొత్తంలో రోడ్లకు ఇరువైపులా అవసరమైన మొక్కలను నాటడం,గ్రామంలో ప్రతి ఇంటికి పూల,పండ్ల మొక్కలను పంపిణీ చేయడానికి ప్రణాలికలు సిద్ధం చేసుకుంటున్నాం. అధే విదంగా హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి,మొక్కలను సంరక్షించడానికి ప్రథమ పౌరురాలిగా ప్రతి మొక్కకు ట్రీగార్డు ఏర్పాటు చేయడంతో పాటు మొక్కలను సంరక్షణ కోరకు ప్రత్యేకంగా ఇద్దరు వ్యక్తులను నియమించడం జరుగుతుంది.

ప్రతినిధి:గ్రామంలో ప్రజలు ఎదుర్కోంటున్న సమస్యలు ఏమైనా ఉన్నాయా.?

సర్పంచ్‌: గ్రామంలో ప్రధానం అంతర్గరోడ్ల నిర్మాణాలను ప్రధాన సమస్యగా ఉన్నాయి. వీటి నిర్మాణాలకు కోరకు ఇప్పటికే గ్రామంలో రోడ్ల నిర్మాణాలు లేని అన్ని వీధుల్లో మొరంతో మెటల్‌ రోడ్ల నిర్మాణం చేశాం.అధే విధంగా చాలాకాలంగా నిర్మాణ పనులు నిలిచిపోయిన గ్రామపంచాయితి నిర్మాణ సముదాయాన్ని తిరిగా నిర్మాణం చేయడం సమస్యగా ఉంది . అందుకే పాలన బాధ్యతలు చేపట్టగానే నిర్మాణం కోరకు అవసరమైన అన్ని పనులను మొదలు పెట్టడం జరిగింది.గ్రామంలో స్మశాన వాటిక పనులు ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నాయని దృస్టికి రాగానే దానికి సంబంధించిన అభివృద్ధి పనులు మొదలు పెట్టడం జరిగింది. గ్రామంలో పక్కా గృహాల సమస్య ఉంది. ఇప్పటికే డబుల్‌ బెడ్‌రూం పథకం పరిధిలో గ్రామానికి 60 గృహాలు మంజూరు అయి ఉన్నాయి.వాటికి తోడు మరో 60 ఇండ్లు వస్తే గ్రామంలో ప్రజలకు పక్కా ఇండ్ల సమస్య తీరుతుంది.గ్రామంలో మరో ప్రధాన సమస్య ఆకేరువాగుపై చెక్‌డ్యాం నిర్మాణం జరగాల్సి ఉంది.వీలైనంత త్వరగా దీని నిర్మాణం ప్రారంభించాలని స్థానిక ఎమ్మెల్యే అరూరి రమేష్‌ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది.గ్రామంలో అన్ని వర్గాల ప్రజలకు కమ్యూనిటి భవనాల నిర్మాణాలు జరగాల్సి ఉంది. వీటిని మా పాలకవర్గం సమయంలో పూర్తి చేసే విధంగా కృషి చేస్తాం.అధే విధంగా గ్రామంలో మహిళా సంఘాల సభ్యులకు సమావేశాలు ఏర్పాటు చేసుకోవడానికి ఒక వివో భవనం కావాల్సి ఉంది. ప్రభుత్వ పాఠశాలలో అదనపు తరగతి గదులు,గ్రామంలో డంపింగ్‌ యార్డు,స్మశాన వాటికనిర్మాణాలు జరగాల్సి ఉంది. ఈవిషయంలో సంబంధిత అధికారులు వీలైనంత త్వరగ పనులు పూర్తి చేయాలి.గ్రామంలో సైడ్‌ డ్రైనేజిల సమస్య కూడా తీవ్రంగా ఉంది.

ప్రతినిధి:గ్రామంలో విద్యాపరమైన అభ్యున్నతికి ఎలాంటి చర్యలు తీసుకోనున్నారు.?

సర్పంచ్‌: గ్రామంలో ప్రభుత్వ పాఠశాల పరిరక్షణకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించబోతున్నాం. దాని కోరకు ప్రత్యేకంగా ఈ నెల 20వ తేదిన గ్రామం నుండి విద్యావంతులుగా ఉన్న వారితో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయబోతున్నాం. ఈ సమావేశంలో ప్రభుత్వ పాఠశాల పరిరక్షణకు చేయాల్సిన కార్యక్రమాలను గురించి చర్చిస్తాం. అధే విధంగా ప్రభుత్వ పాఠశాల పరిరక్షణకు గ్రామ విధ్యావంతులు,సర్పంచ్‌,పాఠశాల ప్రధానోపాధ్యాయుడితో ప్రత్యేక కమిటి ఏర్పాటు చేసి,ప్రైవేటు పాఠశాల వద్దు- ప్రభుత్వ పాఠశాల ముద్దు అనే కార్యక్రమంతో ప్రజల్లోకి వెళ్ళి ప్రభుత్వ పాఠశాలను పరిరక్షించే కార్యక్రమం చేయబోతున్నాం. గ్రామంలో విద్యార్ధుల భవిష్యత్తుకు భరోసాగా వారికి స్వంత ఖర్చులతో వారి అవసరమైన అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అధేవిధంగా విద్యకు ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పిల్లలను దత్తత తీసుకొనే ఆలోచన ఉంది.ప్రజల సహకారం ఉంటే ఈ కార్యక్రమం తప్పక విజయవంతం అవుతుంది. విజయవంతం చేస్తాం

ప్రతినిధి: మీ విజన్‌ ఏమిటి..?

సర్పంచ్‌: గ్రామాన్ని అన్ని రంగాల్లో ముందుంచాలనే లక్ష్యంతోనే సర్పంచ్‌గా పోటి చేయడం జరిగింది. ంశంలో వారి అభిప్రాయాలు తెలియజేయడంతో పాటు నాకు సహకరిస్తారనే నమ్మకం నాకుంది.అందుకే గ్రామానికి నా శక్తివంచన లేకుండా సేవ చేయాలనే పట్టుదలతో ఉన్నాను.గ్రామంలో వందశాతం అక్షరాస్యత సాదించే దిశగా అడుగులు వేస్తున్నాం.కాని ప్రారంభించిన ప్రతి పనిలో విజయం సాధించి విజయానికి నిర్వచనంగా చెప్పుకునే స్థాయికి గ్రామాన్ని తీసుకెళ్ళడే లక్ష్యంగా పని చేస్తా.గ్రామంలో ప్రజలు అభివృద్ధి విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సుఖసంతోషాలతో జీవించేందుకు అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పించాలనేదె మా ప్రాధాన లక్ష్యంగా ఎంచుకుని తద్వారా ఆదర్శ గ్రామంగా తీర్చదిద్దుతా.అధే విధంగా గ్రామంలో యువతకు ఉపయోగపడే విధంగా అన్ని సౌకర్యాలతో ఒక లైబ్రరి ఏర్పాటు,అర్హులైన యువతకు ఉపాధి కల్పించేందకు ప్రత్యేక కార్యక్రమాన్ని చెపట్టడం,గ్రామంలో ఒక కళ్యాణ మండపం నిర్మాణం దీని కోరకు ఇప్పటికే ప్రయత్నాలు మొదలు పెట్టాం.నిర్మాణం కోరకు తెలిసిన దాత 5లక్షల రూపాయల విరాళం ఇవ్వడం జరిగింది.అధే విధంగా గ్రామాన్ని నిజమైన ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడానికి అవసరమైన అన్ని కార్యక్రమాలను సమయాణుగుణంగా నిర్వహించి పూర్తి ఆదర్శ గ్రామంగా నిర్మాణం చేసి ప్రజల మన్ననలు పొందుతాం.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *