*గంగవరం మండలంలో రెచ్చిపోతున్న
ఇసుక అక్రమ రవాణా దారులు..
*చోద్యం చూస్తున్న అధికారులు..
గంగవరం(నేటి ధాత్రి) మార్చి 06:
పలమనేరు నియోజకవర్గం గంగవరం మండలంలో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. గంగవరం పంచాయతీ
చిన్నూరు గ్రామానికి చెందిన అధికార
పార్టీ నాయకుడు నడుం
పల్లి సమీపంలోని అప్పిరెడ్డి
చెరువులో స్మశాన వాటికను సైతం ఆక్రమించి జెసిబిలతో ఇసుకను తోడేస్తూ ట్రాక్టర్ల ద్వారా నింపి సొమ్ము చేసుకుంటున్నారు.సమీపంలోని మట్టిని సైతం ఫిల్టర్ చేసి ఇసుకను తయారుచేసి నిల్వ ఉంచి విక్రయిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ఇసుకను టిప్పర్ల ద్వారా ఆ అక్రమ రవాణా దారుడు15 కిలోమీటర్లు
సమీపంలో ఉన్న కర్ణాటకకు రాత్రికి
రాత్రే అధికారుల కన్ను సన్నుల్లో
ఈ అక్రమ రవాణా జరుగుతుందని
పలువురు ఆరోపిస్తున్నారు. ఇంత జరిగినా గాని
భూగర్భ గనుల శాఖ,ఇరిగేషన్ అధికారులు, రెవిన్యూ అధికారులు పట్టించుకోక పోవడం పలు అనుమానాలు రేకెత్తిస్తోంది. ప్రభుత్వ సంపదను ప్రక్క దారి పట్టిస్తున్నా,
లక్షలాది రూపాయలు సొమ్ము చేసుకుంటున్న అధికార పార్టీ నాయకుడికి అధికారులు కొమ్ముకాస్తున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి..
రానున్న రోజుల్లో నడుంపల్లి గ్రామంలో ఎవరైనా మరణిస్తే మా శవాలను
ఎక్కడ వేయాలని ఆ గ్రామస్తులు సైతం
ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇతనిపై ప్రభుత్వ అధికారులు ప్రజా నాయకులు ఎటువంటి చర్యలు తీసుకోలేదంటే ఇందులో వారి చేతివాటం ఎంతో ఉందో అర్థం అవుతుంది. దాదాపుగా చెరువు నుండి నిత్యం 200 లోడ్లు ఇసుకను అక్రమ రవాణా చేస్తున్న ఇతను పై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది..