జాతీయ రహదారిపై ముమ్మర తనిఖీలు
బాలానగర్ /నేటి ధాత్రి.
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం బాలానగర్ మండల కేంద్రంలోని 44వ జాతీయ రహదారిపై బక్రీద్ పండుగ సందర్భంగా పశువులను కళేబరాలకు తరలించకుండా ఎస్సై లెనిన్ ఆధ్వర్యంలో.. గురువారం సాయంత్రం ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. అక్రమంగా గోవులను కళేబరాలకు తరలిస్తే కఠినంగా శిక్షిస్తామన్నారు. బక్రీదు పండుగ వరకు 44వ జాతీయ రహదారిపై ప్రతినిత్యం తనిఖీలు ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో పశువైద్య సిబ్బంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
