ఆదిలోనే ఆటంకాలు..ఐదేళ్లు ఎన్ని అడ్డంకులు!

`ఉద్దండ పార్టీల మధ్య విజయ్ కి మొదలైన ఇబ్బందులు.

`బాలరిష్టాలు అన్ని పార్టీలకు సహజమే.

`గతంలో ఇబ్బందులు ఎదుర్కొన్న పార్టీల కన్నా కొంత ఎక్కువే.

`గెలిచాడు సరే.. నిలబడతాడా అన్నదే కొంత సందేహం.

`ఈ రాజకీయాలొద్దని పారిపోయేలా చేయాలనుకుంటున్నారా!

`రాజకీయాలలో సాధ్యమేనా.. విజయ్ వెనుకడుగు వేస్తాడా!

`రెండు బలమైన పార్టీల మధ్య నలిగిపోతాడా.

`ఎదిరించి నిలబడి తానేంటో నిరూపించుకుంటాడా!

`అంత ఆత్మ స్టైర్యం లేకుండా విజయ్ రాజకీయాలలోకి వచ్చి ఉంటాడా!

`కాలం అనుకుంలించక పొతే ఏదైనా జరగొచ్చు!

`ఎన్టీఆర్ తొలిసారి సిఎం అయ్యాక ఇలాంటి ఇబ్బందులే ఎదుర్కొన్నారు.

`నాదెండ్ల వల్ల పదవిని కోల్పోయాడు.

`తర్వాత ఎన్టీఆర్ ప్రభంజనం సృష్టించారు.

`తమిళనాడు లో అదే పునరావృతం కాబోతోందా.

`అదే పరిస్థితి డిఎంకె, ఎఐడి ఎం కె లు తీసుకొస్తే ప్రజలు సహిస్తారా.

`తెలిసి, తెలిసి ఆ రెండు పార్టీలు పొరపాటు చేయక పోవచ్చు.

`విజయ్ ఇచ్చిన హామీలు అంత ఆశా మాషి వ్యవహారం కాదు.

`ఆ హామీల అమలు బడ్జెట్ తమిళనాడుకు లేదు.

`ఇచ్చిన హామీలనుంచి తప్పించుకోవడం సాధ్యమయ్యే పని కాదు.

`బలమైన ప్రతిపక్షాలు విజయ్ ని ఉక్కిరి బిక్కిరి చేస్తాయి.

`తొలి గండమే విజయ్ కి కునుకు లేకుండా చేస్తోంది.

`హామీల అమలు సుడి గుండాలయి తరుముతాయా!

హైదరాబాద్, నేటిధాత్రి:
దేవుడు వరమిచ్చినా పూజారి కనికరించడం లేదన్న సామెత విజయ్ విషయంలో నిజమౌతోందా? ఇల్లు అలకగానే పండగ కాదన్న సత్యం విజయ్‌కు అర్దమైనట్లుందా? తమిళ రాజకీయాల్లో ఎప్ప్పుడూ చూడని విచిత్రమైన పరిస్దితి తొలిసారి టివికే. అధినేత విజయ్ ఎదుర్కొంటున్నారు. సునాయాసంగా గెలిచామన్న సంబరం కొద్ది సేపు మిగలకుండా పోతోంది. అయితే ఇందుకు విజయ్ చేసిన పొరపాటు కూడా వుంది. విజయ్ విజిల్‌బాగానే వేశారు. కాని అది కేవలం 108 నియోజకవర్గాలకే వినపడింది. నిజానికి విజయ్ విజిల్ వేస్తే మొత్తం తమిళనాడు చెవులు గిల్లుమానాలి. కాని అలా కాలేదు. అలా జరగలేదు. కారణం ఎన్నికల సమయంలో విజయ్ చేసిన చిన్న తప్ప్పు అనేది కూడా తెలుస్తోంది. మొత్తం 242 నియోజకవర్గాలలో విజయ్ కేవలం 38 నియోజకవర్గాలలో మాత్రమే ప్రచారం నిర్వహించారు. గత రెండు సంవత్సరాలుగా అన్ని ప్రాంతాలను ఆయన చుట్టి వచ్చారు. తమిళనాడులో అనేక ప్రాంతాలలో సభలు నిర్వహించారు. రోడ్ షోలు చేశారు. ఇంత వరకు బాగానే వుంది. కాని తీరా ఎన్నికల సమయంలో ఆయన కేవలం 38 నియోజకవర్గాలలో మాత్రమే ప్రచారం చేయగలిగారు. ఇది ఆ పార్టీకి పెద్ద మైనస్ అయ్యిందనే చెప్పకతప్పదు. ఎందుకంటే తమ నియోజకవర్గానికి విజయ్ వస్తాడు. ప్రచారం చేస్తాడు. ఆయనను మేం చూస్తాం. ఆయన మాటలు వింటామని ఎంతో మంది ప్రజలు ఆశపడ్డారు. సినీ నటుడిగా ఆయనపై ప్రజలకు వున్న అభిమానం అలాంటిది. విజయ్ ఫక్తు రాజకీయ నాయకుడు కాదు. ఆయన కోట్లాది మంది అభిమానులున్న స్టార్ హీరో. తమిళనాడు అంటేనే సినిమా. సినిమా అంటేనే తమిళనాడు. అక్కడ రాజకీయాలన్నీ సినిమాలతో ముడిపడి వున్నవే. అందుకే సినీ లోకం అక్కడ రాజకీయాలను దశాబ్దాలుగా శాసిస్తూ వస్తోంది. అలాంటి తమిళనాడులో నేను రాకున్నా ఓట్లు వేయండి అనే ఫార్ములా వర్కౌట్ కాలేదు. కేవలం 38 నియోజకవర్గాలలోనే ఆయన విజిల్ వేస్తే 108 స్దానాలకు వినిపించింది. కనీసం ఓ 50 నియోజకవర్గాలలో ఆయన విజిల్ వేస్తే సినీ పరిబాషలో దుమ్ము లేచిపోయేది. కనీసం 150 సీట్లు వచ్చేవి. కాని 108 సీట్ల వద్దే విజయ్ పార్టీ ఆగిపోయింది. నిజం చెప్పాలంటే విజయ్ ఆ మాత్రం గెలుపైనా చిన్నది కాదు. సామాన్యమైనది అసలే కాదు. కాని కావాల్సినంత మెజార్టీ రాలేదు. మరో 10 సీట్లు గెల్చుకుంటే విజయ్ సంతోషం మరో రేంజ్‌లో వుండేది. రాజకీయాల్లో ఇప్పటికీ ఓ సామెత చెప్ప్పుకుంటారు. ఎన్నికల్లో ఓడిన వాడు అక్కడే బోరున ఏడుస్తాడు. గెలిచిన వాడు ఇంటికెళ్లి ఎక్కెక్కి ఏడుస్తాడని అంటుంటారు. ఇప్ప్పుడు సరిగ్గా తమిళనాడు రాజకీయాల్లో జరుగుతోంది. ఓడిన డిఎంకే, అన్నాడిఎంకేలు అక్కడే ఏడ్చేశాయి. తేరుకున్నాయి. కాని విజయ్‌కి గెలిచిన సంతోషం లేదు. ఆనందం అంతకన్నా లేదు. ఎప్ప్పుడే ఏమౌతుందో అర్దం కావడం లేదు. సింహం సింగిల్‌గానే వచ్చింది. కాని అడివంతా గెలవలేకపోయింది అన్నట్లు విజయ్ పార్టీ గెలిచిన తీరు కూడా అలాగే వుంది. ఎన్నికల ముందు పొత్తుతో వెళ్లినా బాగుండేదేమో? ఇప్ప్పుడు పొత్తులేని సంసారం సాగేలా లేదు. ఇతర పార్టీలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసినా దినదిన గండం నూరేళ్ల ఆయుష్షులాగానే వుంటాయి. ఎందుకంటే కాంగ్రెస్ బలపడాలని చూస్తుంది. ప్రభుత్వంలో బాగస్వామ్యం కావాలని కోరుతుంది. ఉభయ కమÖ్యనిస్టులు ప్రభుత్వంలో చేరుకపోయినా పంటి కింద రాయిలా మారుతారు. ఇతర చిన్నా, చితక పార్టీలు మద్దతిచ్చినా మంత్రి పదవలు కోరుకుంటారు. ఏరకంగా చూసినా విజయ్ తన సొంత ఎజెండాను అమలు చేయలేరు. ప్రభుత్వంలో సీక్రెసీ మెంటైన్ చేయలేరు. రేపటి రోజు ప్రతి విషయాన్ని ఆయన ఇతర పక్షాలతో పంచుకోవాల్సిందే. వారికి అన్ని విషయాల్లో స్వేచ్చనివ్వాల్సిందే. ఆయా పార్టీలు వద్దంటే ఎంత పెద్ద నిర్ణయమైనా మానుకోవాల్సిందే. తర్వాత జరిగే అన్ని ఎన్నికల్లోనూ పొత్తులు పెట్టుకోవాల్సిందే. స్ధానిక సంస్ధల ఎన్నికల్లో ఆయా పార్టీల గొంతెమ్మ కోరికలు తీర్చాల్సిందే. అడిగిన్ని సీట్లు ఇవ్వాల్సిందే. తనను నమ్ముకొని రాజకీయం చేస్తున్నవారు త్యాగాలకు సిద్దపడాల్సిందే. పైగా ఆయన విజయ్ ఇచ్చిన హమీలు అమలు అనేది అంత సులువు కాదు. ఇప్ప్పుడు ప్రభుత్వ ఏర్పాటుకు పడుతున్న పురిటి నొప్ప్పులు ఐదేళ్లపాటు పడాల్సిందే. బాలారిష్టాలు ఐదేళ్లపాటు ఎదుర్కొవాల్సిందే. అదే తన సొంత మెజార్టీతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ప్రతిపక్షాలను ధీటుగా ఎదుర్కొనే అవకాశం వుంది. కాని ఇప్ప్పుడు ప్రభుత్వంలో బాగస్వామ్యంగా వుండే పార్టీలు పక్కలో uల్లెంలా తయారౌతారు. విజయ్ ఇచ్చిన మ్యానిఫెస్టోలో కొన్ని పెద్ద హమీలున్నాయి. అందులో తమిళనాడులో వున్న మహిళలందరికీ నెలకు. రూ.2500 ఇస్తామని ప్రకటించారు. దాంతో పెద్దఎత్తున మహిళలు ఓట్లేశారు. పెళ్లికి ముందు వదువుకు 8 గ్రాముల బంగారం ఇస్తామన్నారు. అయితే తెలంగాణలో కళ్యాణలక్ష్మి పేరుతో లక్షరూపాయలు ఇస్తున్నారు. అదనంగా తులం బంగారం ఇస్తామన్నారు. సాధ్యపడడం లేదు. రూ.లక్ష మాత్రం ఇస్తూవస్తున్నారు. తెలంగాణలో కూడా మహిళలకు రూ.2500 ఇస్తామన్నారు. ఇప్పటి వరకు దాని అమలు సాద్యం కావడం లేదు. కాని ఈ హమీ అమలు చేయకపోతే విజయ్ ప్రభుత్వంలో కలిసి సాగే పార్టీలే ప్రశ్నించే పరిస్తితి రావొచ్చు. ప్రతి నిరుద్యోగికి రూ.4000 ఇస్తామని మాటిచ్చారు. తెలంగాణలోనూ గత రెండు ఎన్నికల్లోనూ ఇదే హమీ ఇచ్చి మర్చిపోయారు. 2018 ఎన్నికల్లో ముందు కాంగ్రెస్ ప్రకటించింది. అదెలా సాధ్యమని ప్రశ్నించిన కేసిఆర్ తర్వాత తను కూడా ప్రకటించారు. గెలిచిన తర్వాత అసలు ఆ హమీ ఇవ్వలేదని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. తర్వాత అదే పని ప్రస్తుత ప్రభుత్వం కూడా చెప్పింది. నిండు సభలో ఆర్ధిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క నిరుద్యోగభృతి హమీ ఇవ్వలేదని తేల్చేశారు. కాని విజయ్‌కు అలా చెప్పడం సాద్యం కాకపోవచ్చు. అక్కడ బలమైన ప్రతిపక్షాలున్నాయి. అటు డిఎంకే, ఇటు ఏఐడిఎంకేలు ఓ ఆరు నెలల తర్వాత వెంటపడతారు. గతంలో ఆ రెండడు పార్టీలు ఇచ్చిన హమీలు తచ తప్పకుండా అమలు చేశారు. గతంలో జయలలిత అమలు చేసిన హమీలు కూడా తర్వాత స్టాలిన్ అమలు చేశారు. ఆ రెండు పార్టీలకు మాట మార్చిన చరిత్రలేదు. ఇప్ప్పుడు విజయ్ మాట మార్చితే మాత్రం భవిష్యత్తు వుండదు. ఏడాదికి ఆరు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ అన్నాడు. ఇది కూడా అమలు సాధ్యమయ్యేది కాదు. ఐదు లక్షలు ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామన్నారు. లోకల్ అభ్యర్ధులకు 75శాతం రిజర్వేషన్ అమలు చేస్తామన్నారు. ఉన్నత చదువుల కోసం విద్యార్ధులకు రూ.20లక్షల వరకు రుణాలు ఇస్తామన్నారు. ఏపిలో అమలౌతున్న అమ్మ ఒడి లాంటి పధకంలో భాగంగా తమిళనాడులో రూ.15వేలు ప్రతి విద్యార్ధికి ఇస్తామన్నారు. ఇక మరో పెద్ద హమీ ఐదు ఎకరాలలోపు వున్న రైతులకు రుణమాఫీ చేస్తామన్నారు. ఇన్ని హమీల అమలు అనేది విజయ్‌కు నల్లేరు మీద నడక కాదు. కత్తి మీద సామే అవుతుంది. అటు మైనార్టీ ప్రభుత్వం ఇటు, హమీల సవాళ్లు స్వాగతం పలుతుంటాయి. అటు ప్రతిపక్షాలైనా, ఇటు ప్రబుత్వంలో భాగస్వామ్య పక్షాలైనా సరే ఓ ఆరు నెలల పాటు ఆగుతారేమో? తర్వాత ప్రశ్నించడం మొదలు పెడతారు. ఇదిలా వుంటే ఆదిలోనే విజయ్‌కు అనేక ఆటంకాలు ఎదురౌతున్నాయి. కాకపోతే గవర్నర్ నిర్ణయాన్ని కూడా ప్రజాస్వామ్య వాదులు తప్ప్పు పడుతున్నారు. 2018 ఎన్నికల్లో కర్నాటకలో బిజేపి ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సీట్లు గెల్చుకోలేదు. కాకపోతే సింగిల్ లార్జెస్టు పార్టీలాగా అవతరించింది. కాని అప్పటి గవర్నర్ యడ్యూరప్పను ప్రభుత్వ ఏర్పాటుకు స్వాగతించారు. తర్వాత బల నిరూపన చేసుకోమన్నారు. కాని ప్రస్తుతం తమిళనాడు గవర్నర్ మాత్రం పూర్తి మెజార్టీ 118 ఎమ్మెల్యేలతో కూడిన లిస్టు కావాలంటున్నారు. అయితే విజయ్ 112 మంది ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లిస్టు అందజేసినా గవర్నర్ అనుమతించలేదు. అయితే ఇలాంటి రాజకీయ పరిస్దితులు సృష్టించి, విజయ్‌ను ఇబ్బంది పెట్టాలని చూస్తే గతంలో ఎన్టీఆర్‌కు ప్రజలు ఎలా బ్రహ్మరథం పట్టారో, విజయ్ కూడా అలా ప్రభంజనం సృష్టించే అవకాశం లేకపోలేదు. విజయ్‌కు అవకాశమిచ్చి ప్రభుత్వ ఏర్పాటుకు సమ్మతించడమే సరైన నిర్ణయమని అంటున్నారు. లేకుంటే విజయ్ మరింత బýపడేందుకు దారులు వేసినట్లే అవుతుంది.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version