ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం వేగవంతం చేయాలి
ఎంపీఓ శ్రీపతి బాబురావు
జైపూర్,నేటి ధాత్రి:
జైపూర్ మండల పంచాయతీ అధికారి శ్రీపతి బాపు రావు జైపూర్ మండలంలోని రామారావుపేట,ఇందారం, టేకుమట్ల,ఎల్కంటి గ్రామపంచాయతీలను ఆకస్మికంగా సందర్శించారు.ఉపాధి హామీ పథకం వర్క్‌సైట్లను పరిశీలించి, కూలీలకు త్రాగునీటి వసతి,నీడ వసతి కల్పిస్తూ అధిక సంఖ్యలో పనులకు హాజరయ్యేలా చూడాలని,కూలీల హాజరు శాతాన్ని పెంచాలని పంచాయతీ కార్యదర్శులకు సూచించారు.అలాగే ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను పరిశీలించి, వివిధ దశల్లో ఉన్న ఇండ్లను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.పేమెంట్ పెండింగ్‌లో ఉన్న లబ్ధిదారుల వివరాలను సేకరించి హౌసింగ్ శాఖ అధికారులకు అందజేయాలని సూచించారు.పంచాయతీరాజ్ కమిషనర్ ఆదేశాల మేరకు అన్ని గ్రామపంచాయతీలలో ఏర్పాటు చేసిన చలివేంద్రాలను పరిశీలించి, చల్లని త్రాగునీరు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.అనంతరం యాప్ ఇన్‌స్పెక్షన్ నిమిత్తం సంబంధిత రిజిస్టర్లు,రికార్డులను తనిఖీ చేశారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సత్యనారాయణ గౌడ్, రామారావుపేట సర్పంచ్ పులి రాజశేఖర్,ఉపసర్పంచ్ నాగరాజు,పంచాయతీ కార్యదర్శులు పి.సురేష్,ఎల్. ప్రశాంత్,ఆర్.శ్రావణి,టి. శ్రీనివాస్, గ్రామపంచాయతీ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.
