కామారెడ్డి/మద్నూర్ నేటి ధాత్రి:
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండలం పెద్ద ఎక్లరా గ్రామం లో మార్కండేయ మందిరంలో సోమవారం పద్మశాలి సంఘం 2025 క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది. పెద్ద ఎక్లరా పద్మ శాలి సంఘం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమం లో గ్రామ పద్మశాలి సంఘం అధ్యక్షుడు మెరిగే వార్ శ్రీనివాస్ సెక్రటరీ శక్కర్ కోట కిసాన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమం లో సంఘం నాయకులు పాల్గొని క్యాలెండర్ ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు మెరిగే వార్ శ్రీనివాస్ మాట్లా డుతూ..ఫిబ్రవరి 1 న జరిగే మార్కండేయ జయంతిని ఘనంగా జరపాలని నిర్ణయించారు. పద్మశాలీలు తమ కృషి, పట్టుదల, నైపుణ్యంతో ప్రత్యేకతను చాటుకుంటున్నారు. వారి చేతివృత్తి, చేనేత కళలు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి అన్నారు.కాలమాని మనిషి జీవితంలో ఎంతో అవసరమని అన్నారు. ఉదయం లేవగానే క్యాలెండర్ లోతిథి వార నక్షత్రలతో పాటుతేదీ పండుగలుచూసి దైనందిన కార్యక్రమాలు నిర్వహిస్తారని అన్నారు. పండుగలు సంఘటితంగా జరగాలి, ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు మెరిగే శ్రీనివాస్ సెక్రెటరీ శక్కర్ కోట కిషన్ పోశెట్టి గాడప్ వార్ వేంకంట్ పట్వారి శ్రీకాంత్ బిజా వార్ వెంకటరమణ బీజవార్ వెంకటేశం బి.రాములు వినాయక్ జి. బాలాజీ భాస్కర్ శక్కర్ కోట శ్రీనివాస్
పద్మశాలి కుటుంబ సభ్యులు ఉన్నారు.