తెలంగాణ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ డిమాండ్
వరంగల్, నేటిధాత్రి
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పేరుకుపోయిన ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ, తెలంగాణ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వరంగల్ ఐఎంఎ హల్ లో విలేకరుల సమావేశాన్ని వైద్యులు నిర్వహించారు. ప్రభుత్వం నుండి క్లెయిమ్‌లు రానందున అన్ని ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆసుపత్రులు తేదీ 10.1.2025 నుండి ఆరోగ్యశ్రీ రోగులకు చికిత్సను నిలిపివేసాయి అని తెలిపారు. సేవలను నిలిపివేయడానికి కారణాలు తెలుపుతూ ఆసుపత్రులు వారి కన్సల్టేషన్ మొత్తాలను మరియు జీతాలను చెల్లించలేనందున కన్సల్టెంట్‌లు పని చేయడానికి ఇష్టపడరు అని, గత ఆరు నెలలుగా ఆసుపత్రులు తమ మొత్తాన్ని చెల్లించలేక పోయినందున సరఫరాదారులు తమ సరఫరాలను నిలిపివేశారు అని, ఈ ప్రాతినిధ్యంలో మా ప్రతిపాదనలను ఆరోగ్య మంత్రికి, ఆరోగ్యశ్రీ సీఈవోకు కూడా ఫిర్యాదు చేశాం అని వైద్యులు తెలిపారు. వారి నాలుగు ప్రధానమైన డిమాండ్లను ప్రభుత్వానికి తెలియజేశామని వైద్యులు అన్నారు. ఈకార్యక్రమంలో తెలంగాణ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ రాకేష్, డాక్టర్ విజయచందర్ రెడ్డి, డాక్టర్ నాగార్జున రెడ్డి, డాక్టర్ రమేష్, డాక్టర్ సుదీర్ కుమార్, డాక్టర్ సమర్ధ రెడ్డి, డాక్టర్ మహేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.