సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు శీలం అశోక్
జమ్మికుంట: నేటి ధాత్రి
ప్రజా సమస్యల పరిష్కారం కావాలంటే ప్రతి ఒక్కరు ఎర్ర జెండా బాట లో నడవాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు శీలం అశోక్ పిలుపునిచ్చారు.
బుధవారం రోజున స్థానిక ఇల్లందకుంట మహాసభ మల్లయ్యఅధ్యక్షతన జరిగింది. ఈ మహసభల ప్రారంభానికి ముఖ్యఅతిథిగా హాజరైన సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు శీలం అశోక్ మాట్లాడుతూ దేశంలో, రాష్ట్రంలో ప్రజలు అనేకసమస్యలతోఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. కనీసం పాలక వర్గ పార్టీలు సమస్యల వైపు కనీసం కన్నెత్తి చూడటంలేదనిచెప్పారు.ఎర్రజెండా పార్టీ మాత్రమే ప్రజలు ఎదుర్కొంటున్న ప్రజల పట్ల నిలబడుతుందని తెలిపారు. సిపిఎం పార్టీ ప్రజలకు ఎక్కడ ఏ సమస్య వచ్చిన ముందు ప్రజల పక్షాన నిలబడుతుందని వివరించారు.ఈ దేశంలో విద్యార్థులు యువకులు మహిళలు రైతులు కార్మికులు కష్టజీవుల పక్షాన న్యాయం కోసం నిలబడుతుందని అన్నారు. సమస్యల పరిష్కారం కోసం సిపిఎం నిర్వహించే పోరాటాల్లో ప్రజలు పాల్గొని, విజయవంతం చేయాలన్నారు.సిపిఎం పార్టీ మహాసభలు ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయని, ఈ మహాసభలు గ్రామం ,వార్డు, స్థాయి నుంచి, మండలం, జిల్లా,రాష్ట్రం,జాతీయ,స్థాయిలో జరుగుతాయని గత మూడు సంవత్సరాలుగా పార్టీ చేసిన కార్యక్రమాలు, నిర్మాణం సమీక్షించుకొని భవిష్యత్తులో మరింత ముందుకు పోవడం కోసం అనేక చర్చలు ఈ మహాసభలో జరుగుతాయని భవిష్యత్తులో పార్టీ బలోపేతం కోసం చర్చలు జరుగుతాయని ఆయన తెలిపారు.మహాసభల లో నూతన శాఖ తిప్పర బోయిన శ్రీకాంత్ కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఈ కార్యక్రమం లో సిపిఎం పార్టీ నాయకులు చేల్పూరి రాము, కొత్తూరి మల్లయ్య, గురుకుంట్ల కట్ట స్వామి, రాజేందర్, జంబుకం వెంకన్న, రవి,ఎల్లయ్య, పాల్గొన్నారు.