
cattle roam
పశువులు రోడ్లపై సంచరిస్తే గోశాలలకు తరలిస్తాం..
మున్సిపల్ కమీషనర్ గద్దె రాజు, పట్టణ ఎస్సై రాజశేఖర్
రామకృష్ణాపూర్ నేటిధాత్రి:
రామకృష్ణాపూర్ పట్టణంలో పశువుల యజమానులు పశువులను యదేచ్చగా వదలడంతో రోడ్లపై సంచరిస్తున్నాయని, వాహనదారులకు,పాదాచారులకు ప్రమాదాలు జరిగి గాయాల పాలవుతున్నారని తమ దృష్టికి వచ్చిందని మున్సిపల్ కమిషనర్ గద్దె రాజు, పట్టణ ఎస్ఐ రాజశేఖర్ లు అన్నారు. పత్రిక ప్రకటన వెలువడిన 48 గంటలలోగా పశువులను వారి యజమానులు ఇంటికి తీసుకువెళ్లాలని, లేనియెడల పశువులను గోశాలలకు తరలిస్తామని అన్నారు.పట్టణ ప్రజలను ఇబ్బందిపెడుతున్న పశువులపై మున్సిపాలిటీ, పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో తీసుకునే చర్యలకు పశువుల యజమానులు పూర్తి బాధ్యులవుతారని మున్సిపల్ కమిషనర్ గద్దె రాజు, ఎస్సై రాజశేఖర్ లు పట్టణ పశు యజమానులకు సూచించారు.