
రోడ్లకు ఇరువైపులా వాహనాలు నిలిపి ఇబ్బంది కలిగించవద్దు
పరకాల సీఐ క్రాంతికుమార్
పరకాల నేటిధాత్రి
హన్మకొండ జిల్లా పరకాల పట్టణ ప్రాంతంలో భాహిరంగాగా మద్యం సేవించిరాదనీ,మద్యం సేవించి వాహనాలు నడపితే చర్యలు తప్పవని,వాహనంపై వెళ్లేటప్పుడు వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ మర్చిపోకుండా ధరించాలని డ్రైవింగ్ చేసేటప్పుడు ఫోన్ ఉపయోగించరాదన్నారు.మీ భద్రత మీ చేతుల్లోనే ఉందని ఎల్లప్పుడు గుర్తుంచుకొని తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.రోడ్డుకు ఇరువైపున పలు వ్యాపార సముదాయాల ముందు ద్విచక్ర వాహనాలు ఆటోలు ఇతర వాహనాలు నిలపడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తుతుందని, దీంతో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయన్నారు. లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేయడం,అతివేగం, ప్రమాదకరమైన డ్రైవింగ్, మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం,హెల్మెట్ లేకుండా వాహనం నడపడం,ద్విచక్ర వాహనంపై త్రిబుల్ రైడింగ్ చేయడం ఇట్టి నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.రోడ్డు ప్రమాదాలను నివారించడం కోసం పరకాల పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నామ ని సీఐ క్రాంతికుమార్ తెలిపారు.