హన్వాడ :నేటి ధాత్రి:
మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండలం గుడిమల్కాపూర్ గ్రామంలో మంగళవారం పండ్ల మొక్కలను ఉచితంగా పంపిణీ చేశారు.ఐసీఐసీఐ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి గుడి మల్కాపూర్ పంచాయతీ సెక్రటరీ భరత్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.అనంతరం గుడి మల్కాపూర్ పంచాయతీసెక్రటరీ భారత్ కుమార్ మాట్లాడుతూ రైతులు పండ్ల చెట్లను పెంచుకొని అదికాదాయంతో మెరుగుపడాలని సూచించారు అదేవిధంగా ఈ కార్యక్రమంలో ఐసిఐసిఐ ఫౌండేషన్ ప్రతినిధులు మురళీమోహన్ కృష్ణయ్య గ్రామ పెద్దలు రవి కుమార్ బొడి గోపాల్ కృష్ణయ్య బాలరాజ్ చెన్న రెడ్డి రమేష్ బొడి వెంకటయ్య చిన్న పోషన్న యువకులు పెద్ద ఎత్తున్న రైతులు పాల్గొన్నారు..