ఓదెల(పెద్దపల్లి జిల్లా)నేటిధాత్రి:
ఓదెల మండలం పొత్కపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వాహనదారులు ట్రాఫిక్ నియమాలు రోడ్డు భద్రత పాటించకపోతే కఠినమైన చర్యలు ఉంటాయని ఎస్ఐ తెలియజేశారు. ఈ సందర్భంగా పలువురికి రోడ్డు భద్రతపై ఆదివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై జి. అశోక్ రెడ్డి మాట్లాడుతూ,, ధ్రువీకరణ పత్రాలు లేని వాహనాల, డ్రైవింగ్ లైసెన్స్ లేని వారిపై, ఇన్సూరెన్స్ లేని వారిపై నెంబర్ ప్లేట్ నిబంధనల ప్రకారం లేని, వాహనాలపై కేసులు నమోదు చేశారు. రోడ్డు భద్రత నియమాలు, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేయడంతో పాటు జరిమానాలు విధిస్తున్నామన్నారు వాహనదారులు తప్పనిసరిగా వాహన ధ్రువీకరణ పత్రాలు, లైసెన్సులు, ఇన్సూరెన్స్, పత్రాల కలిగి ఉండాలన్నారు. ర్యాష్ డ్రైవింగ్ చేసే వారిపై, డ్రైవింగ్ లైసెన్స్ లేని వారికి లేని వారికి బండి ఇవ్వడం, మైనర్ పిల్లలకు వాహనాలు ఇవ్వడం, నెంబర్ ప్లేట్ లేకుండా వాహనాల
నడపడం, మద్యం సేవించి వాహనాలు నడపడం చేసే వారిపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రదేశాలలో, స్కూల్స్ కాలేజీ లలో ఆత్మహత్యలు డ్రగ్స్ బాల్య వివాహాలు వరకట్నం చట్టాలపై, నూతన మహిళా చట్టాలపై అవగాహన కల్పిస్తునట్లు తెలిపారు. ఆన్లైన్, క్యూఆర్ కోడ్, వాట్సప్ ద్వారా కూడా స్వీకరిస్తారని తెలిపారు. మహిళలు, పై ఆన్లైన్లో అసభ్యకర పోస్టులు పెట్టే సైబర్ నేరగాళ్లపై కూడా సైబర్, షీ టీమ్ సమన్వయంతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని చెప్పారు. మహిళలు షీ టీం సేవలు ఉపయోగించుకోవాలని సూచించారు ఎల్లవేళలా అందుబాటులో ఉండి సేవలు అందిస్తామని తెలిపారు. ఎవరైనా వేధించిన, రోడ్డుపై వెళ్లేటప్పుడు అవహేళనగా మాట్లాడిన, ఉద్దేశపూర్వకంగా వెంబడించిన విద్యార్థినిలు, మహిళలు అత్యవసర పరిస్థితులలో రామగుండం పోలీస్ కమిషనరేట్ షీ టీం నెంబర్ 6303923700 కి కాల్ చేసి, వాట్సాప్ ద్వారా సందేశం పంపించి లేదా డయల్ 100 కు కాల్ చేసి తక్షణ పోలీస్ సహాయం పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై జి. అశోక్ రెడ్డి తో పాటు ఏఎస్ఐ ఎస్. సుధాకర్. కానిస్టేబుల్స్స్ లావణ్య. ఎం రజిత. వై రాజేందర్.కె. రాజు తదితరులు పాల్గొన్నారు.