ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సమక్షంలో 200 మందికి పైగా చేరిక..
మహబూబ్ నగర్ జిల్లా ;;నేటి ధాత్రి
బీఆర్ఎస్ పార్టీలో చేరికల జోరు కొనసాగుతున్నది… వివిధ పార్టీలు, సంఘాలకు చెందిన నాయకులు జడ్చర్ల నియోజకవర్గం అభివృద్ధికి ఆకర్షితులై బీఆర్ఎస్ లో చేరుతున్నారు.
జడ్చర్ల చంద్రఫంక్షన్ హాల్ లో నిర్వహించిన మండలపార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశంలో కొడంగల్ గ్రామ కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్య నాయకుడు శ్రీనివాస్ రెడ్డితో సహా పలువురు బీఆర్ఎస్ లో చేరారు. చిన్న ఆదిరాల అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు 30 మందికి పైగా బిఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. అదేవిధంగా గంగాపూర్ వార్డు సభ్యుడు రాజుతో సహా పలువురు నాయకులు కార్యకర్తలు కారెక్కారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి వారందరికీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అంతకుముందు జడ్చర్ల లోని ఎమ్మెల్యే నివాసంలో జడ్చర్ల వెల్డింగ్ అసోసియేషన్ సభ్యులు 50 మందికి పైగా ఎమ్మెల్యే సమక్షంలో పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, పార్టీలో చేరిన ప్రతి ఒక్కరు ఈ 45 రోజులు పార్టీ అభ్యున్నతికి పాటుపడాలని, నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలన్నారు. సమిష్టికా కృషి చేస్తే లక్ష మెజారిటీ తప్పక వస్తుందని ధీమా వ్యక్తం చేశారు