ఆనందంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు

చిల్పూర్(జనగామ)నేటి ధాత్రి: తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ పండుగ సంబరాలను హిందూ సంప్రదాయ ప్రకారం ప్రతి సంవత్సరం అశ్వయుజ మాసం మహాలయ అమావాస్య రోజున బతుకమ్మ పండుగ మొదలవుతుంది. తంగేడు పూలతో పాటు రకరకాల పూలనే పూజించడం మన తెలంగాణ సాంప్రదాయం.చిల్పూర్ మండలంలోని చిన్న పెండ్యాల గ్రామంలో మహిళలు,చిన్నారులు బతుకమ్మ పండుగను వైభవంగా ఆట పాటలతో ఆడి పాడి
అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా రకరకాల పువ్వులు గుమ్మడి పూలు,తంగేడు పువ్వులు,సీతా జడపూలు, బంతి, చామంతి పూలు, కట్లాయి పూలతో బతుకమ్మలను పేర్చి, అమ్మవారికి బియ్యం పిండి, నువ్వుల పిండితో చేసిన ప్రసాదాలు నైవేద్యం సమర్పిస్తారు. మొదటిరోజు పేర్చే బతుకమ్మను ఎంగిలిపూల బతుకమ్మగా పిలుస్తారు.ఈ విధంగా తొమ్మిది రోజులు తొమ్మిది రకాల పేర్లతో బతుకమ్మ లుగా పేర్చి, అమ్మవారిని కొలుస్తారు.అనంతరం స్థానికంగా ఉన్న దేవాలయాల దగ్గరికి తీసుకెళ్ళి మహిళలందరూ బతుకమ్మల చుట్టూ పాటలు పాడుతూ తిరుగుతూ ఆడి పాడి సమీపంలో గల నీటి కొలనులో నిమజ్జనం చేస్తారు. చిన్న పెండ్యాల గ్రామంలోని హనుమాన్ దేవాలయం ప్రాంగణంలో మహిళలు బతుకమ్మ పండుగను పాటలు సాంప్రదాయ నృత్యాలతో ఆనందంగా జరుపుకున్నారు.ఈ కార్యక్రమంలో చిల్పూర్ మండలం సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు చిన్న పెండ్యాల గ్రామ సర్పంచ్ మామిడాల లింగారెడ్డి, స్థానిక ఎంపీటీసీ తాళ్లపల్లి ఉమా సమ్మయ్య గౌడ్, హనుమాన్ దేవాలయ ప్రధాన అర్చకులు ఎల్లంబట్ల కరుణాకర్ శర్మ,తాళ్లపల్లి ఎల్లయ్య గౌడ్,పేరాల నాగభూషణం,బుచ్చయ్య తోపాటు గ్రామ పెద్దలు మహిళలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *