హిందూ ధర్మం ప్రపంచానికే ఆదర్శం

హిందూ ధర్మం ప్రపంచానికే ఆదర్శం

హిందూ ధర్మాన్ని పరిరక్షించే బాధ్యత అందరిదీ

హిందూ ధర్మ సమ్మేళన సమితి కమిటీ ప్రకటన-అధ్యక్షుడుగా సింగిరికొండ మాధవశంకర్

మే 5 న హిందూ ధర్మ సమ్మేళనం — వాల్ పోస్టర్ ఆవిష్కరణ

నర్సంపేట,నేటిధాత్రి:

 

హైందవ సంస్కృతి,హిందూ ధర్మం సాంప్రదాయాలు నేడు ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని హిందూ ధర్మ సమ్మేళన సమితి నర్సంపేట అధ్యక్షుడు సింగిరికొండ మాధవశంకర్ అన్నారు.నర్సంపేట పట్టణంలోని శ్రీ ధర్మశాస్త అయ్యప్పస్వామి దేవాలయం ప్రాంగణంలో హిందూ ధర్మ సమ్మేళన సమితి నర్సంపేట కమిటీని ప్రకటించారు.సమితి గౌరవ అధ్యక్షుడు మోతే సమ్మిరెడ్డి అధ్యక్షతన సమావేశం జరిగింది. ముందుగా నూతన కమిటీని ప్రకటించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు సింగిరికొండ మాధవ శంకర్ మాట్లాడుతూ హిందువుగా గర్వించు హిందువుగా జీవించు అనే నినాదంతో ముందుకు పోతున్నదని తెలిపారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాల పట్ల హిందూ ధర్మ పరిరక్షణ కోసం దేశవ్యాప్తంగా ప్రచారం ముమ్మరంగా కొనసాగుతుందని పేర్కొన్నారు. హైందవ ధర్మాన్ని పూర్తిస్థాయిలో విశ్లేషణ చేయడం కోసం తమ్మేళన కార్యక్రమాలు తప్పనిసరి అని అన్నారు.

ఇనుగులపై మతమార్పిడిలను అరికట్టేందుకు గాను హిందూ సాంప్రదాయాలను కాపాడడానికి ఐక్యంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.హిందూ ధర్మ సమ్మేళనం కార్యక్రమం పట్ల గడపగడపకు కలపత్రం ప్రచార కార్యక్రమం చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. మే నెల నర్సంపేట పట్టణంలోని రెడ్డి ఫంక్షన్ హాల్ లో జరిగే హిందూ ధర్మ సమ్మేళనం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా మాధవశంకర్ పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సహాయఆధ్యక్షురాలు దార్ల రమాదేవి, ప్రధాన కార్యదర్శి పోలబోయిన మురళీధర్,ఉపాధ్యక్షులు డాక్టర్ రాజేంద్రప్రసాద్ రెడ్డి, డాక్టర్ ఆర్షనపెల్లి మోహన్ రావు,సైఫా సురేష్, చింతల కమలాకర్ రెడ్డి, వేములపల్లి సుబ్బారావు, డ్యాగల శ్రీనివాస్, వాసు నాయక్, కొల్లూరి లక్ష్మీనారాయణ, నిర్వహణ కార్యదర్శి దొడ్డ రవీందర్, కోశాధికారి మేడారపు కమలాకర్, సహకోశాధికారి పాండ్య రమేష్, ప్రచార కార్యదర్శి లు మహాదేవుని జగదీష్, మల్యాల ప్రవీణ్ కుమార్, మల్యాల వినయ్ కుమార్, కృష్ణారావు, గుడిపూడి అరుణ,ముస్కు నీరజ,అపరదపు సంధ్య తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version