నేను నోరు విప్పితే కాపురాలు కూలిపోతాయి!
ఆ సీక్రెట్ కపుల్స్ గుట్టు రట్టు?
సింగర్ గీతా మాధురి.. టాలీవుడ్ టాప్ సింగర్లలో ఒకరు. తన గొంతుతో మాయ చేసే గీత, ఇప్పుడు తన మాటలతో ఇండస్ట్రీని షేక్ చేస్తున్నారు. ఆమె చేసిన ఒక్క కామెంట్ ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. “నేను నోరు విప్పితే కాపురాలు కూలిపోతాయి” అంటూ ఆమె చేసిన వ్యాఖ్యల వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి?
ప్రముఖ గాయకుడు నోయల్ నిర్వహిస్తున్న లేటెస్ట్ ఇంటర్వ్యూలో గీతా మాధురి గెస్ట్‌గా హాజరయ్యారు. దీనికి సంబంధించిన ప్రోమో బయటకు రాగానే నెట్టింట సెన్సేషన్‌గా మారింది. తను సరదాగా కాఫీ షాపులకు వెళ్ళినప్పుడు అక్కడ తారసపడే సీక్రెట్ లవ్ కపుల్స్ గురించి గీత ఆసక్తికరమైన లీకులు ఇచ్చారు.
.
నేను ఎప్పుడో ఒక రోజు కాఫీ షాప్‌కి వెళ్తాను. ఆ రోజే ఏదో ఒక ప్రేమ జంట అక్కడికి వస్తుంది. నేను వెళ్లినప్పుడే ఎవరో ఒకరు దొరుకుతారు. ఇలా చాలా మంది నాకు కనిపించారు” అంటూ నవ్వుతూ చెప్పారు గీత మాధురి. అయితే ఈ విషయంపై ఆమె చేసిన మరో కామెంట్ సంచలనం సృష్టించింది.నేను చూసిన వాటి గురించి నోరు తెరిస్తే కాపురాలు కూలిపోతాయి అంటూ గీతామాధురి చెప్పడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
గీతా మాధురి అన్న ఈ మాట ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఆమె చూసిన ఆ ‘సీక్రెట్ జంటలు’ టాలీవుడ్ ప్రముఖులేనా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పూర్తి ఎపిసోడ్ వస్తే తప్ప ఈ ‘కాఫీ షాప్’ మిస్టరీ వీడేలా లేదు.
