ఆంద్రనాట ‘‘చంద్రోదయం’’

https://epaper.netidhatri.com/view/285/netidhathri-e-paper-5th-june-2024%09

బైబై జగన్‌ బాగా పనిచేసింది!

`సైకిల్‌ లెక్క సరిచేసింది!

`పవన్‌ ఫ్యాన్స్‌ ముందు ఫ్యాన్‌ గడగడలాడిరది.

`పవన్‌ పంతం నెగ్గింది!

`చంద్రుడికి మళ్ళీ పున్నమి వచ్చింది.

`అమరావతికి కళొచ్చింది.

`ఏపి. మళ్ళీ పుంజుకోనుంది.

హైదరాబాద్‌,నేటిధాత్రి:

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయకుడు రాజకీయాలల్లో సంచలనం సృష్టించారు. తన సుదీర్ఘమైన రాజకీయ జీవితంలో కొత్త చరిత్రను తిరగరాశారు. సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టారు. ఒక నాయకుడు తన జీవిత కాలంలో ఇన్ని ఎత్తు పల్లాలను చూసిన ఏకైక నాయకుడుగా చరిత్ర కెక్కారు. దేశ రాజకీయాల్లోనే నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా, మూడుసార్లు ప్రతిపక్ష నేతగా చేసిన ఏకైక నాయకుడుగా చరిత్ర పుటల్లో నిలిచిపోయారు. పట్టుదలకు మారు పేరుగా నిలిచారు. భవిష్యత్తు తరాలకు ఆదర్శవంతమైన నేతగా తనదైన ముద్ర వేసుకున్నారు. ఉమ్మడి రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు, విభజిత ఆంధ్రప్రదేశ్‌తోపాటు దేశ రాజకీయాల్లో కూడా అనేకసార్లు కీలకభూమిక పోషించిన చంద్రబాబు మరోసారి దేశ రాజకీయాలను మరోసారి ప్రభావితం చేయనున్నారు. ఒకనాడు వాజ్‌పాయ్‌ ప్రభుత్వానికి, అంతకుముందు యునైటెడ్‌ ఫ్రంట్‌ సమయంలో కేంద్రంలో కీలకభూమిక పోషించారు. ఒక రకంగా చెప్పాలంటే కేంద్ర రాజకీయాలను ఆయన శాసించారు. ఒక దశలో ఆయనను ప్రధానమంత్రిగా దేశంలోని రాజకీయ పార్టీలన్నీ ప్రతిపాదించినా, తెలుగు ప్రజల సంక్షేమమే తన ధ్యేయమని చెప్పిన ఏకైక నాయకుడు చంద్రబాబు. నిజానికి ఆయన స్ధానంలో ఏ నాయకుడు వున్నా ప్రధాని కావాలని కోరుకునేవారు. రాజకీయాలు చేసేవారు. కాని ఆయన తాను తెలుగు ప్రజలకు సేవ చేయడంలోనే తనకు తృప్తి వుందని చెప్పి, కేంద్ర రాజకీయాలను ప్రభావితం చేశారు. ఎన్డీయే చైర్మన్‌గా ఆయన బిజేపిని కూడా తన కనుసన్నల్లో శాసించారు. కాకపోతే మోడీ వచ్చిన తర్వాత జాతీయ రాజకీయాల్లో చంద్రబాబు ప్రభ కొంచెం తగ్గింది. ఆయన ఎన్డీయే చైర్మన్‌ పదవినుంచి తప్పుకునేలా చేసింది. ఇలా ఆయన అనేక ఎత్తుపల్లాలు చూశారు. అయినా ఆయన ఏనాడు దిగాలు చెందలేదు. దిగులు పడలేదు. తెలుగు ప్రజల కోసం ఆయన అనేకం ఎదుర్కొన్నారు. ఒకప్పుడు వైఎస్‌ చేత పడరాని మాటలు పడ్డారు. వైఎస్‌ అయినా ప్రజల కోసం ఆయన నిలబడ్డారు. రాష్ట్రం విడిపోయినప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు చంద్రబాబునే కోరుకున్నారు. కాకపోతే 2019 ఎన్నికల్లో జగన్‌ ఒక్క ఛాన్స్‌…ఒక్క ఛాన్స్‌ ప్లీజ్‌ అంటూ జనాన్ని అర్ధించుకోవడంతో వైసిసిని ఎన్నుకున్నారు. కాని జగన్‌ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయాడు. ఎంతసేపు చంద్రబాబును సాధించాలనే రాజకీయాలు మాత్రమే చేశారు. చివరికి చంద్రబాబును జైలు పాలు చేశారు. అది ఆంధ్రప్రదేశ్‌ ప్రజలను సైతం కలిచివేసింది.

మళ్లీ ముఖ్యమంత్రిగానే అసెంబ్లీలో అడుగుపెడతా! అని శఫధం చేసిన నాయకులు ఇద్దరు తెలుగుదేశం పార్టీకి చెందిన అధినేతలే కావడం విశేషం.

ఒకప్పుడు 1989లో ఓటమి పాలైన తర్వాత కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్టీఆర్‌ను పదేపదే కార్నర్‌ చేస్తూ వచ్చేది. నిండు సభలో అవమానిస్తూ వచ్చేది. దాంతో కాంగ్రెస్‌ అంతు చూస్తానని శపధం చేసి, మళ్లీ ముఖ్యమంత్రిగానే అసెంబ్లీలో అడుగుపెడతానని శపధం చేశాడు. నెరవేర్చుకున్నాడు. ఇప్పుడు సరిగ్గా చంద్రబాబు కూడా అదే చేశాడు. అసెంబ్లీ సాక్షిగా జగన్‌ పదే పదే చంద్రబాబును అడ్డుకుంటూ, అవమానిస్తూ వుండడంతో విసుగు చెందిన చంద్రబాబు, మళ్లీ ముఖ్యమంత్రిగానే అసెంబ్లీలో అడుగు పెడతానని ప్రతిజ్ఞ చేశాడు. అనంతరం ప్రజల్లోకి వెళ్లాడు. ఇదే సమయంలో లోకేష్‌ పాదయాత్ర చేపట్టాడు. తెలుగుదేశంపార్టీకి విశేషమైన ఆదరణ లభిస్తుండడం చూసి, చంద్రబాబును మానసికంగా దెబ్బకొట్టాలన్న లక్ష్యంతో జగన్‌ జైలుకు పంపించాడు. ఇదిలా వుంటే చంద్రబాబు మీద వ్యక్తిగత వ్యాఖ్యలు చేస్తూ వల్లభనేని వంశీ లాంటి వారు చేసిన కామెంట్లు అతి జుగుస్పాకరంగా ప్రజలు పరిగణించారు. ఇక అంబటి రాంబాబు లాంటి వారు ఎప్పుడూ చేసే విపరీత వ్యాఖ్యలు కూడా చంద్రబాబును ఎందుకు వద్దనుకున్నామా? అన్నంతగా ప్రజలను ఆలోచింపజేశాయి. ఇక కొడాలి నాని లాంటి వారు నిత్యం చంద్రబాబు మీద చేసిన వ్యాఖ్యలు వారి రాజకీయ జీవితానికే సమాదిగా మారాయి. ఇలా ఒక సీనియర్‌ నాయకుడిని ఇష్టానుసారం పగ పట్టినట్లు వేధించడాన్ని తెలుగుప్రజలు అంగీకరించలేదు. ఉమ్మడి రాష్ట్రం విడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు అమరావతి రాజధాని నిర్మాణం కోసం ఎంతో కష్టపడ్డాడు. అదే సమయంలో పోలవరం మీద కూడా ఎంతో దృష్టిపెట్టారు. కాని జగన్‌ వచ్చి అటు అమరావతిని చిన్నాభిన్నం చేశాడు. పోలవరం వదిలేశాడు. ఆంధ్రప్రదేశ్‌ అభివృ ద్దిని కుంటుపడేలా చేశాడు. కేవలం ప్రతీకారరాజకీయాలపైనే జగన్‌ ఎక్కువ దృష్టిపెట్టాడు. పైగా మూడు రాజధానులను తెరమీదకు తెచ్చి, ఆంధ్రప్రదేశ్‌ ప్రజల ఆత్మగౌరవం దెబ్బతీశాడు. అమరావతి రాజదాని నిర్మాణం పూర్తయితే తనకంటే చంద్రబాబుకే ఎక్కువ పేరు వస్తుందని అనుకున్నాడు. అభివృద్దిని కొనసాగించాల్సిన చోట ఆపేశాడు. విశాఖను రాజధాని చేస్తానన్నాడు. కర్నూలును న్యాయ రాజధాని అన్నాడు. అమరావతిని ఏదో రకంగా దెబ్బతీసే కుట్ర చేశాడు. దాంతో ప్రజలు ఐదేళ్లపాటు సంయమనం పాటించారు. సమయం చూసి జగన్‌ను కోలుకోలేని దెబ్బ కొట్టారు.

ఈ ఎన్నికల తెలుగుదేశం పార్టీకే అధ్భుతమైన విజయం అని చెప్పకతప్పదు..

ఇంతటి విజయం గతంలో తెలుగుదేశం ఎన్నడూ చూడలేదు. ఎన్టీఆర్‌ సమయంలో కూడా ఇంతటి ప్రభంజనం కనిపించలేదు. అసలు వైసిపికి ప్రతిపక్ష హోదా లేకుండాపోవడం అంటేనే విచిత్రం. 1994లో ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి కాంగ్రెస్‌కు కేవలం 26 సీట్లకు పరిమితం చేసి ప్రతిపక్ష హోదా లేకుండా ఆనాడు చేసిన ఘనత తెలుగుదేశంకే దక్కింది. ఇప్పుడు వైసిపికి అసలు ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లోనే చోటు లేకుండా చేసిన ఘనత చంద్రబాబుకు దక్కింది. గత ఎన్నికల్లో 23 అసెంబ్లీ, 3పార్లమెంటు సీట్లకు పరిమితమైన తెలుగుదేశంపార్టీని నామ రూపాలు లేకుండా చేయాలని జగన్‌ చేయని ప్రయత్నం లేదు. కాని ఇప్పుడు ఇప్పుడు జగన్‌కు అందులో సగం అసెంబ్లీ సీట్లు వచ్చేలా ప్రజలు తీర్పిచ్చారు. లోక్‌సభలో వైసిపికి ప్రాతినిధ్యమే లేకుండా చేశారు. దీన్నె ఖర్మ ఫాలోస్‌ అంటారు. ఇక తెలుగుదేశంపార్టీకి జనసేన తోడవడంతో అసలు కూటమికి పట్టపగ్గాలులేకుండాపోయాయి. జనసేన పోటీచేసిన అన్ని సీట్లు గెవడం అంటే సామాన్యమైన విషయం కాదు. పవన్‌ ఎంతో కసిగా పనిచేశారు. ఆయన అభిమానులు కూడా ఈసారి గట్టిగా పనిచేశారు. నినాదాలు కాదు, ఓట్లు వేయండి. నన్ను గెలిపించండి. అభివృద్ది అంటే ఎలా వుంటుందో చూపిస్తానంటూ జనసేనాని పవన్‌ మాటలు ప్రజలు బలంగా నమ్మారు. పైగా బైబై జగన్‌ అంటూ పవన్‌ చేసిన ఎత్తిపొడుపులు ప్రజలు బాగా ఆదరించారనే చెప్పాలి. లేకుంటే ఇంతటి సునామీ రాదు. ఇక గతంలో 2014లో బిజేపి, జనసేన, తెలుగుదేశం మూడు పార్టీలు కలిసి ఆనాడు జగన్‌ను ఎదుర్కొన్నాయి. విజయం సాధించాయి. తర్వాత తెలుగుదేశంపార్టీ బిజేపికి దూరమైంది. ప్రత్యేక హోదా మీద చంద్రబాబు ఫ్రధాని మోడీని దూరం చేసుకున్నారు. జనసేన కూడా 2019 ఎన్నికల్లో ఒంటిరిపోరాటం చేసింది. అది జగన్‌కు బాగా కలిసివచ్చింది. మూడు పార్టీలకు కోలుకోలేని దెబ్బ తగిలింది. మరి ఇప్పుడు మళ్లీ ఆ మూడు పార్టీలు ఏకమై జగన్‌ను కోలుకోలేని దెబ్బకొట్టారు. ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో కొత్తచరిత్ర లిఖించారు. అయితే జగన్‌కూడా ఇంతటి పరాభవం గుర్తించలేదు. తెలంగాణలో కేసిఆర్‌ లాగానే జగన్‌ ప్రజలకు దూరమయ్యాడు. ఇంటికే పరిమితమయ్యాడు. నాయకులకు అందుబాటులో లేకుండా వున్నాడు. చంద్రబాబు మీద కక్షపూరిత రాజకీయాలకే సమయం వెచ్చించాడు. దాంతో ప్రజలు జగన్‌ను వద్దనుకున్నారు. బైబై జగన్‌ అన్నారు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *