జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
భూపాలపల్లి నేటిధాత్రి
నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన చాకలి ఐలమ్మ భావితరాలకు స్ఫూర్తిని నింపారని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. చాకలి ఐలమ్మ 39వ వర్ధంతి సందర్భంగా భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో రజక సంఘం వారి ఆధ్వర్యంలో నిర్వహించిన వర్ధంతి వేడుకల్లో ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు కాంగ్రెస్ పార్టీ నేతలతో కలిసి పాల్గొన్నారు. అనంతరం అక్కడ ఏర్పాటుచేసిన చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులర్పించారు. అనంతరం భూపాలపల్లి కలెక్టరేట్లోని ఐడిఓసి కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వర్ధంతి వేడుకల్లో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పాల్గొని ఐలమ్మ చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, వీరనారి చాకలి ఐలమ్మ అందరికీ ఆదర్శనీయురాలని కొనియాడారు. వారు ఆనాడు చేసిన ఉద్యమమే తెలంగాణ సాయుధ పోరాటానికి నాంది అయిందని, ఆ తర్వాత మళ్లీ దశ తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి నింపిందని ఎమ్మెల్యే గుర్తు చేశారు. చాకలి ఐలమ్మ ధైర్యం, తెగువ ఆనాటి దేశ్ ముఖ్ లు, ప్రజా కార్ల గుండెల్లో దడపుట్టించాయని అన్నారు. ఒకవైపు సాయిధ పోరాటం చేస్తూనే, మరోవైపు ఉద్యమకారులకు అమలు అన్నం పెట్టిన మహనీయురాలు అని అన్నారు. చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను ఈనెల 26న రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించబోతున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మి బీసీ సంక్షేమ అధికారి శైలజ పట్టణ అభివృద్ధి అధికారి రాజేశ్వరి కాంగ్రెస్ పార్టీ పిసిసి మెంబర్ చల్లూరు మధు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పిప్పాల రాజేందర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సుంకర్ రామచంద్రయ్య జిల్లా నాయకులు బుర్ర కొమురయ్య కౌన్సిలర్ దాట్ల శ్రీనివాసు రవీందర్ చంద్రగిరి శంకర్ నాయకులు పాల్గొన్నారు