ఓదెల(పెద్దపెల్లి జిల్లా)నేటిధాత్రి
ఓదెల మండలం కోమిరే (భీమరిపల్లె)గ్రామానికి చెందిన రంగు రాయమల్లు అనే గీతా కార్మికుడు వృత్తిలో భాగంగా తాడిచెట్టుకు ఎక్కి ప్రమాదవశాత్తు జారి కింద పడగా అక్కడికక్కడే మరణించాడు.ప్రభుత్వం వెంటనే స్పందించి మరణించిన గీతా కార్మికుని కుటుంబానికి ప్రభుత్వం నుండి రావలసిన ఎక్స్గ్రేషియా వెంటనే అందజేయాలని సర్వాయి పాపన్న మోకు దెబ్బ గౌడ సంక్షేమ సంఘం నాయకులు మరియు గౌడ సంఘం నాయకులు కోరారు.