అఖిల భారత రైతు కూలీ సంఘం మండల అధ్యక్షులుగా గడ్డం లాలయ్య
గుండాల,నేటిధాత్రి :
అఖిలభారత రైతు కూలీ సంఘం ఏఐకేఎంఎస్ మండల మహాసభ శనివారం మండలంలోని రోళ్ళగడ్డ గ్రామంలో జరిగింది.
అఖిలభారత రైతు కూలీ సంఘం ఏఐకేఎంఎస్ మండల అధ్యక్షునిగా గుండాల మండల కేంద్రానికి చెందిన గడ్డం లాలయ్యను చెట్టు పల్లి గ్రామానికి చెందిన బచ్చల సారయ్యలను ప్రధాన కార్యదర్శిగా వీరితో పాటు 19 మంది కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ15, 20 రోజుల తర్వాత వర్షాకాలం ప్రారంభం కాబోతుందని వ్యవసాయం చేసే రైతులకు అందుబాటులో ఎరువులు,విత్తనాలు కొరత లేకుండా చూడాలని అన్నారు.
గత సంవత్సరం రైతులకు యూరియా కొరత ఏర్పడి 30 శాతం పంటలను యూరియా కొరత వల్ల వదిలేశారని అన్నారు.వర్షాకాలం ప్రారంభమవుతున్న క్రమంలో వ్యవసాయ అధికారులు ఈ కొరతలను దృష్టిలో పెట్టుకొని రైతులకు యూరియా అందుబాటులోకి తేవాలని కోరారు.ఏజెన్సీ ప్రాంతంలో ఇప్పుడిప్పుడే రైతులు వ్యవసాయ బోర్లు వేసుకొని పంట తీస్తున్న క్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ బోర్లకు స్మార్ట్ మీటర్లు పెట్టాలని ఆలోచన చేయడం దుర్మార్గమైన చర్యగా అభి వర్ణించారు.
వర్షాకాలం మార్క్ పేడ్ ద్వారా గుండాల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పిఎసిఎస్ కొనుగోలు చేసిన మొక్కజొన్నల గన్ని బ్యాగు డబ్బులు గోల్మాల్ జరిగినాయి అని ప్రచారం జరుగుతుందని పై అధికారులు విచారణ నిర్వహించి గన్ని బ్యాగుల డబ్బులు రైతుల ఖాతాల లొ వేయాలని డిమాండ్ చేశారు. లేనియెడల రైతులతో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు.
