బల్గూరి గణేష్ హత్య కేసు: అసలు నిజాలు దాచి పోలీసుల దర్యాప్తు తప్పు దోవ!
పోలీసులు చెబుతున్న వాదనలకు, కుటుంబ సభ్యుల ఆరోపణలకు మధ్య పొంతన లేని గణేష్ హత్య కేసు
గే యాప్, వ్యక్తిగత ఫోటోల పేరుతో కొత్త డ్రామా
అసలు నిజాలు బయటపెట్టాలని డిమాండ్
కేసును తప్పుదారి పట్టించేలా మాట్లాడిన డిఎస్పీ పై వెంటనే చర్యలు తీసుకోవాలి
బల్గూరి మైసయ్య, కుటుంబ సభ్యులు బంధుమిత్రులు గ్రామ ప్రజలు డిమాండ్
కోదాడ, నేటి ధాత్రి : బల్గూరి గణేష్ హత్య కేసు సంబంధించిన నిజాలను దాచి పోలీసులు కేసును పక్కదోవ పట్టిస్తున్నారంటూ డిమాండ్ చేస్తూ. సోమవారం కోదాడ మండల పరిధిలోని గణపవరం గ్రామంలో గ్రంధాలయ సెంటర్ వద్ద ఏర్పాటు చేసినటువంటి విలేకరుల సమావేశంలో బల్గూరి మైసయ్య కుటుంబ సభ్యులు బంధుమిత్రులు గ్రామ ప్రజలు మాట్లాడుతూ. కోదాడ రూరల్ పోలీసులు టెక్నికల్ ఆధారాలు, కాల్ డేటా సహాయంతో, నిందితులను పట్టుకుని, పోలో గే డేటింగ్ యాప్ వ్యక్తిగత ఫోటోల వివాదం వల్లే ఈ హత్య జరిగిందని వెల్లడించిన వాదనలు సరైనవి కావని. పోలీసుల దర్యాప్తు సరైన దిశలో లేదని నిజాలను దాచిపెట్టి ఈ కేసును తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని అనుమానం బలంగా వ్యక్తమౌతుంది. పోలీసుల వ్యవహారం పూర్తిగా అనుమానస్పదంగా ఉందని ఘటన స్థలంలో క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ ను సమర్థంగా వినియోగించలేదని. ఇది సాధారణ నిర్లక్ష్యం కాదు, ఉద్దేశపూర్వక వైఫల్యం. సేకరించిన వేలిముద్రలు ఫోరెన్సిక్ ఆధారాలు ఏమయ్యాయి? ఎందుకు బయట పెట్టడం లేదు? పోస్టుమార్టం రిపోర్ట్ రాకముందే కథలు చెప్పడం ఇది దర్యాప్త లేక కప్పిపుచ్చడమా. డిఎస్పీ శ్రీనివాస్ రెడ్డి ప్రెస్ మీట్ లో చేసిన వ్యాఖ్యలు నిజాలను మాయ చేసే ప్రయత్నంగా కనిపిస్తున్నాయని ఎందుకంటే A 2 చెప్పిన అంశాల్లోని కీలక ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా మౌనవహించడం ఎందుకు. డాగ్ స్క్వాడ్ చూపిన దారిని పక్కనపెట్టి వేరే దారిలో దర్యాప్తు మళ్లించడం వెనుక అసలు కారణంమేమిటి. మొదటి రోజు నుంచే కేసును ఒకే కోణంలోకి నెట్టడం ఇది దర్యాప్తు కాదు. గణేష్ వ్యక్తిగత జీవితం ముఖ్యంగా ప్రేమ వ్యవహారం కోణాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం అనుమానస్పదమని మరణించిన వ్యక్తి గౌరవాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడడం తీవ్రంగా ఖండిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బల్గురి స్నేహ దుర్గయ్య మాట్లాడుతూ.. దళితుడి ప్రాణానికి విలువ లేదా. ఎస్సీ, ఎస్టీ దళితుడి ప్రాణానికి విలువ లేదా చట్టం ఎందుకు పెట్టడం లేదు. ఈ కేసులో ఎస్సీ ఎస్టీ (ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్) యాక్ట్ 1989 అమలు చేయకపోవడం దళితులపై జరుగుతున్న వ్యవస్థాత్మక అన్యాయానికి స్పష్టమైన ఉదాహరణ. ఈ కేసును ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద నమోదు చేయాలి. స్థానిక పోలీసులపై నమ్మకం లేకపోవడంతో కేసును సీట్ లేదా ఉన్నత స్థాయి సంస్థకు అప్పగించాలని. అన్ని ఫోరెన్సిక్ క్లూస్ టీం డాగ్ స్క్వాడ్ అన్ని ఆధారాలను ప్రజల ముందు ఉంచాలని. కేసును తప్పుదారి పట్టించేలా మాట్లాడిన డిఎస్పి పై వెంటనే చర్యలు తీసుకోవాలి. నిందితులను వెంటనే అరెస్టు చేసి ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ జరిపి కఠిన శిక్షలు విధించాలి. బాధిత కుటుంబానికి పూర్తి భద్రత న్యాయం జరిగే వరకు ప్రభుత్వ రక్షణ కల్పించాలి. గణేష్ హత్య కేసులో నిజాలు బయటకు రాకపోతే ఈ పోరాటం గణపవరం గ్రామానికి పరిమితం కాదు జిల్లా నుండి రాష్ట్రస్థాయికి వ్యాపించే భారీ ప్రజా ఉద్యమంగా మారుతుందని. దళితులపై అన్యాయం జరిగితే మౌనం ఉండబోము. న్యాయం కోసం రోడ్లపై దిగుతాం ప్రజాస్వామ్య పోరాటాన్ని ఉధృతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బాధిత కుటుంబ సభ్యులు, మృతుని బంధువులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
