ఆడిపాడే వయస్సు నుంచి.. ఉన్నత స్థాయి విద్యా వరకు

# ఘనంగా 2007-2008 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.

నర్సంపేట,నేటిధాత్రి :

ఆడిపాడే వయస్సు నుంచి పాఠశాల స్థాయి ఉన్నత విద్యా వరకు అంతా ఒకటై కలిసి మెలిసి ఆడుతూ పాడుతూ విద్యను కొనసాగించారు. చిన్ననాటి స్నేహితులు అంతా ఒకేచోట చదువుకున్నారు. పదో తరగతి పూర్తయ్యాక కొంతమంది ఉద్యోగాల్లో స్థిరపడగా, మరికొంత మంది వ్యాపారం, ఇతర రంగాల్లో కొనసాగుతున్నారు. ఈ క్రమంలో దుగ్గొండి మండలంలోని మల్లంపల్లిలో గల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 2007-2008 బ్యాచ్ కు చెందిన పూర్వ విద్యార్థిని, విద్యార్థులు వారు చదువులు నేర్చుకున్న అదే పాఠశాలలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు.ఆత్మీయ పలకరింపులు, ఆలింగనాల నడుమ నాటి మధుర స్మృతులను నెమరేసుకున్నారు.నాడు విద్యాబుద్ధులు నేర్పిన ప్రధానోపాధ్యాయులు సోమయ్యలు ,గురువులు కృష్ణమూర్తి సత్యప్రసాద్ మధుకర్ శ్రీనివాస్ అశోక్ సురేందర్ రెడ్డి కరంచంద్,ప్రత్యేక ఆహ్వానితులు చుక్క రమేష్,తడుక కొమురయ్యలను శాలువతో ఘనంగా సన్మానించారు.గత 16 సంవత్సరాల పాఠశాల స్థాయి పదో తరగతి విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న పూర్వ విద్యార్థులందరూ ఒకేచోట చేరవడంతో సందడి వాతావరణం నెలకొంది.పలు రంగాల్లో స్థిరపడ్డ పూర్వ విద్యార్థులం ఇక నుండి సమాచారాన్ని పంచుకోవాలని ఉండాలంటూ ఫోన్‌ నంబర్లు తీసుకోవడంతో పాటు ఈ మధుర జ్ఞాపకాలను తమ తమ సెల్‌ఫోన్లలో బంధించుకున్నారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు కొమ్మక బాబు, ములుగు సురేష్.ముప్పారపు రాజేందర్,బొల్లం శ్రీకాంత్,కార్తీక్,కొనుకటి సరిత. లెనిన్,మౌనిక,నామాల రాజ్యలక్ష్మి, జానకి,నవీన్,ఉమా, శ్రావణి, ప్రతిభ లతో పాటు ఇతర పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!