నకిలీ స్టాంపులు, ఫోర్జరీ సంతకాలు?

*నేటిధాత్రి, వరంగల్ తూర్పు*

వరంగల్ మండల కార్యాలయం పేరుతో నకిలీ స్టాంప్, తహశీల్దార్ సంతకం ఫోర్జరీ చేసిన ఘనుడు. “వినాయక ఫైనాన్స్” పేరుతో మని లెండింగ్ వ్యాపారం కొరకు ధరకాస్తు చేసిన ఏనుమాములకు చెందిన “పస్తం సతీష్”. నకిలీ మనీ లెండింగ్ లైసెన్స్ సమర్పించిన వ్యక్తిపై క్రిమినల్ కేసు నమోదుకు సిఫారసు చేసిన వరంగల్ తహశీల్దార్. తహశీల్దార్ సంతకం ఫోర్జరీ, నకిలీ స్టాంపులతో 2023లో ప్రొసీడింగ్స్ కాపీ తయారీ. 2024 రెన్యువల్ కొరకై అదే నకిలీ ప్రొసీడింగ్స్ కాపీ జతపర్చిన వ్యక్తి. ప్రొసీడింగ్స్ కాపీ, సంతకం, స్టాంపులు పరిశీలించిన వరంగల్ తహశీల్దార్.., అవి ఫోర్జరీ అని నిర్ధారణ చేసి, సంబంధిత వ్యక్తిపై క్రిమినల్ కేసు నమోదు కొరకు మట్టేవాడ పోలీసులకు పిర్యాదు చేశారు వరంగల్ తహశీల్దార్ ఎండి.ఇక్బాల్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!