ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుండే ప్రజాపాలన..

#నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి.

# ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించిన శాసనసభ్యులు దొంతి.

# పంచాయతీరాజ్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం.

నర్సంపేట,నేటిధాత్రి :

ఇకనుండి నర్సంపేట నియోజకవర్గానికి సంబంధించిన ప్రజా పాలన పూర్తిస్థాయిలో తమ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుండి నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తెలిపారు. నర్సంపేట పట్టణంలోని బస్ స్టేషన్ సమీప వరంగల్ ప్రధాన కూడలి వద్ద గత ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ ను నియోజకవర్గ ప్రజాపాలన కోసం సౌకర్యార్థం ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అధునాతన సౌకర్యాలతో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంగా మార్పిడి నిర్మాణం చేశారు. ఈ నేపథ్యంలో గురువారం తన నూతన క్యాంపు కార్యాలయాన్ని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ప్రారంభం చేశారు. ముందుగా వేదమంత్రాలతో పలు హోమాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే మాధవరెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల ను అభివృద్ధి చేయడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం అని తెలిపారు. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలు పూర్తి చేస్తున్నదన్నారు.రైతులకు పెద్దపీట వేస్తూ ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేసిన ప్రభుత్వంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చరిత్ర సృష్టించిందని ఎమ్మెల్యే వివరించారు.

 

# పంచాయతీరాజ్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం..

 

ప్రజాపాలనే లక్ష్యంగా ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తన క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించిన తొలి రోజే నర్సంపేట నియోజకవర్గంలోని పంచాయతీరాజ్ శాఖ పరిధిలో గల బిటి రోడ్ల అభివృద్ధి కోసం సంబంధిత అధికారులతో క్యాంపు కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించి ప్రజాపాలనకు శ్రీకారం చుట్టారు. నియోజకవర్గం పరిధిలో సుమారు 30 కోట్ల రూపాయల నిధులతో పంచాయతీరాజ్ శాఖ పరిధిలోని బీటీ రోడ్ల నిర్మాణాల కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అందుకు సంబంధించిన పూర్తిస్థాయి వివరాలను పంచాయతీరాజ్ శాఖ అధికారుల నుండి ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తీసుకున్నారు.ఎమ్మెల్యే

 క్యాంపు కార్యాలయ ప్రారంభోత్సవంలో నర్సంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి నియోజకవర్గ కన్వీనర్ తక్కల్లపల్లి రవీందర్ రావు, టిపిసిసి సభ్యులు పెండెం రామానంద్, సొంటిరెడ్డి రంజిత్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తోకల శ్రీనివాస్ రెడ్డి, నర్సంపేట మండల పార్టీ అధ్యక్షుడు బానోతు లక్ష్మణ్ నాయక్, పట్టణ అధ్యక్షుడు కౌన్సిలర్ బత్తిని రాజేందర్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ వేముల సాంబయ్య గౌడ్, దుగ్గొండి మండల పార్టీ అధ్యక్షుడు ఎర్రేళ్ల బాబు, నల్లబెల్లి మండల పార్టీ అధ్యక్షుడు చిట్యాల తిరుపతి రెడ్డి, కౌన్సిలర్లు వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *