
హాస్టల్ విద్యార్థులపై ప్రభుత్వ కపట ప్రేమ-మచ్చ రమేష్
కరీంనగర్, నేటిధాత్రి:
కరీంనగర్ పట్టణంలోని శర్మనగర్ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో పుడ్ పాయిజన్ ఘటన జరగడాన్ని, పుడ్ పాయిజన్ ఘటనలపై సమగ్ర విచారణ జరిపించాలని ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో అడిషనల్ కలెక్టర్ లక్ష్మీకిరణ్ కి వినతిపత్రం అందించడం జరిగింది. ఈసందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి మచ్చ రమేష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతున్న ఏమాత్రం కూడా వాటిపైన విచారణ జరిపించకుండా కేవలం హంగులు, ఆర్భాటాలకే కాంగ్రెస్ ప్రభుత్వం పరిమితమయిందన్నారు. కరీంనగర్ పట్టణంలో శర్మనగర్లోని జ్యోతిబాపూలే గురుకులాల్లో విద్యార్థులు రాత్రి భోజనంలో ఫుడ్ పాయిజన్ అయి విద్యార్థులు హాస్పటల్లో చేరిన పరిస్థితి నెలకొందని దీనికి కారణమైన కాంట్రాక్టర్లను మరియు ఆర్సిఓను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేయడం జరిగింది. నాసిరకమైన ,నాణ్యతలేని కూరగాయలను కాంట్రాక్టర్లు వారి కక్కుర్తితో విద్యార్థుల జీవితాలతో చెలగట మడుతున్నారని, రాజకీయ నాయకుల అండదండలతో కాంట్రాక్టర్లు తక్కువ ధరకు పట్టి నాసిరకమైన కూరగాయలను వస్తువులను సప్లై చేస్తూ విద్యార్థుల చావులకు కారణమవుతున్నారని కావున కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకొవాలని, బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్న ఆర్సిఓపైన జిల్లా కలెక్టర్ సస్పెన్షన్ వేటువేయడంతోపాటు వారి పైన సమగ్రమైన విచారణ చేసి ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వం పనీచేయాలని అన్నారు. ఈకార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు కనకం సాగర్, ఏఐఎస్ఎఫ్ నాయకులు కసిరెడ్డి సందీప్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.