ప్లాట్‌ఫామ్ బయట కూరగాయలను విక్రయించకూడదు
కూరగాయల విక్రయదారులు వారికి కేటాయించిన ప్లాట్‌పామ్స్‌లలోనే కూరగాయలను విక్రయించాలని సిరిసిల్ల పురపాలక సంఘం కమీషనర్ డాక్టర్ కె.వి.రమణాచారి తెలిపారు. బుధవారం సిరిసిల్ల పట్టణంలోని 13వ వార్డులో పారిశుద్ధ్యం, నీటి సరఫరా, ఇతర మౌళిక వసతులు తదితరులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వార్డులో కొనసాగుతున్న అభివృద్ధి పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఇంజనీర్ విభాగం సిబ్బందికి సూచించారు. అనంతరం మార్కెట్ ఏరియాను సందర్శించారు. ప్లాట్‌ఫామ్ బయట కూరగాయలను విక్రయించడం మూలంగా రవాణా, ప్రయాణికులకు ఇబ్బందులు కలుగుతున్నాయని, వారికి కూడా ప్లాట్‌ఫామ్స్‌కు నెంబర్లు కేటాయించి బయట కూర్చున్న విక్రయదారులను కూడా ప్లాట్‌పామ్‌లలోనే విక్రయించేలా చర్యలు తీసుకోవాలని టౌన్ ప్లానింగ్ సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ గుండ్లపెల్లి పూర్ణచందర్, పురపాలక సంఘ కార్యాలయ ఆయా విభాగాల సిబ్బంది పాల్గొన్నారు.