నీళ్ల కోసం రోడ్డెక్కిన కార్మికుల కుటుంబాలు
రోడ్డు దిగ్బంధం,రోడ్డుపై బైఠాయించి ధర్నా
మంచిర్యాల,నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా తాండూరు మండలం మాదారం టౌన్షిప్ లో గత కొన్ని రోజుల నుండి నీటి సమస్యతో కార్మిక కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.నీటి సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లిన సమస్యను పట్టించుకోకపోవడం వల్ల బుధవారం గోలేటి నాలుగు స్తంభాల చౌరస్తాలో రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు.మూడు రోజులలో నీటి సమస్య పరిష్కారం చేయకపోతే జిఎం కార్యాలయం ముందు వంటావార్పు కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. కార్మిక కుటుంబాలు ధర్నా చేస్తున్న విషయాన్ని తెలుసుకున్న ఎస్ఓటు జిఎం రాయమల్లు,సివిల్ డివై జిఎం భాష సింగరేణి అధికారులు రెండు రోజులలో నీటి సమస్య పరిష్కరిస్తామని కార్మిక కుటుంబాలకు హామీ ఇచ్చారు.