జమ్మికుంటలో మావోయిస్టు మాజీ నేత కిడ్నాప్ కలకలం

జమ్మికుంట :నేటిధాత్రి

తెల్లవారుజామున టాటా సుమోలో వచ్చి అపహరణ! ఇది పోలీసుల పనేనా?

కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో మావోయిస్టు మాజీ నేతను గుర్తు తెలయని వ్యక్తులు తెల్లవారుజామున టాటా సుమోలో వచ్చి అపహరించుకు వెళ్లడం హుజురాబాద్ ప్రాంతంలో సంచలనం కలిగిస్తుంది. అయితే ఇది పోలీసుల పనేనా!? అనే అనుమానం కలుగుతుంది. బాధితుని కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జమ్మికుంట పట్టణంలో సోమవారం ఉదయం మావోయిస్టు మాజీ రాష్ట్ర కమిటీ సభ్యుడు ఎండి హుస్సేన్ ఆలియాస్ రమాకాంత్ నీ గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. కుటుంబ సభ్యులకు ఇలాంటి సమాచారం ఇవ్వకుండా స్థానిక పోలీసులకు ఎలాంటి సమాచారం లేకుండానే గుర్తుతెలియని వ్యక్తులు మూతికి మాస్కులు ధరించి టాటా సుమోలో వచ్చి బలవంతంగా ఎక్కించుకొని వెళ్లారు. వచ్చిన వ్యక్తులు పోలీసుల లేదా మాజీ మావోయిస్టుల లేదా ఇంకెవరైనా నా అనే అనుమానాలు రేకెత్తిస్తున్నాయి.

కుటుంబ సభ్యుల ఆందోళన

కుటుంబ సభ్యుల కళ్ళు ఎదుటనే గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి ఎండి హుస్సేన్ ను టాటా సుమోలో కిడ్నాప్ చేయడంతో కుటుంబ సభ్యుల ఆందోళన చెందుతున్నారు. ఎవరు వారు, ఎక్కడివారు.. ఎందుకోసం కిడ్నాప్ చేశారో తెలియక, ఎప్పుడు ఏ వార్త వినాల్సి వస్తుందోనని ఆయన కుటుంబ సభ్యులు భయాందోళన చెందుతున్నారు.

పౌరహక్కుల సంఘం ఖండన!

జమ్మికుంట పట్టణంలో తెల్లవారుజామున పోలీసులు సామాజిక కార్యకర్త రచయిత ఎండి హుస్సేన్ అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఏ ప్రాంత పోలీసులు అని చెప్పకుండా స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వకుండా ఈరోజు తెల్లవారుజామున టాటా సుమోలో తీసుకెళ్లినట్టు పౌరహక్కుల సంఘంకి తెలియ వచ్చిందని, ఎండి హుస్సేన్ కు ఎలాంటి ప్రాణాహని తలపెట్టకుండా బేషరతుగా విడుదల చేయాలని
పౌర హక్కుల సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తుందని పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్ నారాయణరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కాగా ప్రస్తుతం రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్లో ఉన్నటు సమాచారం. హెడ్ కానిస్టేబుల్ అజయ్ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చినట్లుగా తెలిపారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *