మంచిర్యాల నూతన కలెక్టర్ కుమార్ దీపక్
జైపూర్, నేటి ధాత్రి:
ప్రజా శ్రేయస్సు, జిల్లా అభివృద్ధికి అందరం సమిష్టిగా కృషి చేద్దామని కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు. తాజాగా ఐఏఎస్ అధికారుల బదిలీల్లో భాగంగా జిల్లాకు నూతన కలెక్టర్ గా వచ్చిన కుమార్ దీపక్ ఆదివారం రోజున కలెక్టర్‌గా నస్పూర్‌లోని సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదా యంలో బాధ్యతలు స్వీకరించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల ఫలాలను జిల్లాలో అర్హత గల ప్రతీ ఒక్కరికి అందే విధంగా అధికార యంత్రాం గంతో కలిసి పనిచేస్తానన్నారు. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజా సంక్షేమ పథకాలు, మాదకద్రవ్య నిర్మూలన, అన్ని రకాలుగా జిల్లాను అభివృద్ధి చేయటానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు.కుమార్ దీపక్‌కు అదనపు కలెక్టర్‌లు రాహుల్, సబావత్ మోతిలాల్, ఆర్డీవో రాములు, కలెక్టరేట్ పరిపాలన అధికారి రాజే శ్వర్, ఎన్నికల తహసీల్దార్ శ్రీనివాస్‌లు పూలమొక్కలు అందించి స్వాగతం పలికారు. నాగర్ కర్నూల్‌లో అదనపు కలెక్టర్‌గా విధులు నిర్వహించిన కుమార్‌దీపక్ పదోన్నతిపై మంచిర్యాల కలెక్టర్‌గా వచ్చారు. ఫిబ్రవరి 1, 2023 నుంచి ఇక్కడ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న బదావత్ సంతోష్ బదిలీపై నాగర్‌కర్నూర్ వెళ్ళారు.