లక్షేట్టిపేట్ (మంచిర్యాల) నేటిధాత్రి:
పర్యావరణ పరిరక్షణ అందరి బాద్యత అని ప్రతి ఒక్కరు పర్యావరణాన్ని కాపాడుటకు కృషి చేయాలని లక్షెట్టిపేట ఎంపీడీఓ సరోజ అన్నారు. బుధవారం ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా మండలం లోని జెండా వెంకటాపూర్,హనుమంతుపల్లి, లక్ష్మీపూర్,వెంకటరావుపేట్ లలో జాతీయ ఉపాధిహామీ పథకం ద్వార చేపట్టిన అమృత్ సరోవర్ చెరువుల పూడికతీత పనుల వద్ద రైతులు, ఉపాధికూలీలుతో ఏర్పాటు సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఒక్కొక్క నీటి బొట్టును ఒడిసి పట్టి చెరువుల్లో,కుంటల్లోకి మల్లించాలని అన్నారు.భూతాపాన్ని తగ్గించి వర్షం కురువలంటే విరివిగా మొక్కలు నాటాలని వాటి సంరక్షణ కూడ చేపట్టాలన్నారు.అనంతరం రైతులు , ఉపాధి కూలీలతో ప్రతిజ్ఞ చేయించారు.ఈకార్యక్రమంలో ఏపీఓ వెంకటరమణ,ఈసీ స్వామి, సాంకేతిక సహాయకులు బూసిరాజు రాజన్న,షేర్ల శైలజ,కంచి కైవల్య,పంచాయతీ కార్యదర్శులు పూదరి నరేందర్,వంశీకృష్ణ, శ్రవణ్,ఫీల్డ్ అసిస్టెంట్స్ ముంజమ్ మురళి,శ్రీధర్, వెంకటేష్, సతీష్ పాల్గొన్నారు.