ఆర్ట్స్ కాలేజ్ ఎన్సిసి ఆర్మీ క్యాడేట్స్ ర్యాలీ కేయూ క్యాంపస్

ప్రపంచ పర్యావరణ దినంను పురస్కరించి బుధవారం యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఎన్సిసి ఆర్మీ క్యాడేట్స్ పదవ తెలంగాణ బెటాలియన్ తరపున యూఎన్ఈపి పిలుపుమేరకు టైడ్ టర్నర్స్ ప్లాస్టిక్ ఛాలెంజ్ కార్యక్రమాన్ని ర్యాలీ రూపంలో నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీ ఆర్ట్స్ కళాశాల నుండి ప్రారంభమై జిల్లా కలెక్టరేట్ నుండి అదాలత్ అక్కడినుండి మరలా కళాశాలకు ర్యాలీగా ఎన్సిసి క్యాడేట్స్ ప్లాస్టిక్ వల్ల పర్యావరణానికి కలిగే ముప్పు గురించి స్లోగన్స్ రూపంలో నినాదించుకుంటూ అవగాహన కలిగించడం జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కళాశాల ఎన్సిసి అధికారి లెఫ్టినెంట్ డాక్టర్ స్వామి శాడ మాట్లాడుతూ రాబోయే తరాలకు మనం ఇప్పుడు అనుభవించే ప్రకృతి పరిసరాలను అందించాలంటే వాటిని రక్షించాల్సిన బాధ్యత మనందరి పై ఉందని, భావితరాలను దృష్టిలో ఉంచుకొని పర్యావరణ హానికారి అయిన ప్లాస్టిక్ను పూర్తిగా నివారించినప్పుడే మనం భూమిని పర్యావరణాన్ని రక్షించిన వాళ్ళమవుతాం అందుకే సమాజంలో అవగాహన కల్పించడం కోసం ఎన్సిసి క్యాడేట్స్ ఈరోజు 10వ తెలంగాణ బెటాలియన్ తరపున ర్యాలీ తీయడం జరిగింది అన్నారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ నాగయ్య పి ఐ భాష ఎన్సిసి పదవ బెటాలియన్ క్యాడెక్స్ రాజ్ కుమార్, భావన, ప్రవీణ్, నితిన్, కిరణ్, అనుష, స్రవంతి ,బాబా ,వినీత్ ,సిద్దు మొదలైన వారు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *