ennikalaku siddamga unnaam : sp rahul hegde, ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాం : ఎస్పీ రాహుల్‌ హెగ్డే

ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాం : ఎస్పీ రాహుల్‌ హెగ్డే

రాబోవు ఎన్నికలు ఫెయిర్‌ అండ్‌ ఫ్రీగా నిర్వహించడమే లక్ష్యంగా అన్ని రకాల భద్రత చర్యలతో సంసిద్ధంగా ఉన్నామని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్‌ హెగ్డే తెలిపారు. శుక్రవారం సిరిసిల్లలోని పంచాయతీ రాజ్‌ గెస్ట్‌ హౌస్‌లో జరిగిన సమీక్ష సమావేశంలో జిల్లా ఎస్పీ ు ఎన్నికల సాధారణ పరిశీలకులు సి.శరవణన్‌తో పాల్గొన్నారు. రాబోవు ఎన్నికల నిర్వహణ శాంతియుత వాతావరణంలో నిర్వహించటమే లక్ష్యంగా ఈ సమీక్ష సమావేశం కొనసాగింది. సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ మూడు దశలలో జరిగే ఈ ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని రకాల

పటిష్టమైన చర్యలు వివరించారు. జిల్లాలో మొత్తం 266 లోకేషన్లలో పోలింగ్‌ కేంద్రాలు 699, వాటిలో సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలు 90, నార్మల్‌ పోలింగ్‌ కేంద్రాలు 176 ఉన్నాయని తెలిపారు. ఎలాంటి సమస్యలు లేకుండా ముందస్తు ప్రణాళికలు తయారుచేసి సిద్ధంగా ఉన్నామని, పోలింగ్‌ కేంద్రాలు వాటి స్థితిగతులు భౌగోళిక పరిస్థితుల గురించి పోలింగ్‌ కేంద్రం వద్ద ఎంత మంది పోలీసు భద్రత అవసరము, ఏ విధమైన ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లా పరిధిలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా జిల్లా పరిధిలోని అన్నీ బార్డర్‌ పిఎస్‌ పరిధిల్లో (స్టాటిక్‌ సర్వే లెన్స్‌ టీమ్స్‌ 4, చెక్‌పోస్టులను ఏర్పాటు చేయడం, 12 ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌లు, 03 చెక్‌పోస్ట్‌లు 24-7 నిరంతరాయంగా వాహనాలు తనిఖీ చేయడం గురించి వివరించారు. ఇప్పటివరకు అసెంబ్లీ ఎన్నికలలో 1,14,640/- రూపాయల విలువ గల 305.2లీటర్లు, లోక్‌సభ ఎన్నికలలో 631.14 లీటర్ల అక్రమ మద్యాన్ని సీజ్‌ చేశామని చెప్పారు. పెండింగ్‌లో వారెంట్లు అమలు చేశామని, ఇప్పటివరకు 1230మందిని 280కేసులలో శాంతిభద్రతల విఘాతం కలిగించే వ్యక్తులు, పాత నేరస్తులను బైండోవర్‌ చేశామని తెలిపారు. తరచుగా కార్డెన్‌సెర్చ్‌ ఆపరేషన్‌లు నిర్వహిస్తూ ముందస్తు రక్షణ చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. కళాబందంచే జిల్లాలోని ప్రతి గ్రామంలో ఎన్నికల నియమావళి, పలు ముఖ్య చట్టాలు, సాంస్క తిక కార్యక్రమాల ద్వారా అవగాహన కలగజేస్తూ ప్రజలు స్వేచ్చాయుత వాతావరణంలో ఓటుహక్కు వినియోగించుకొనేలా కషి చేస్తున్నామని తెలిపారు. అనంతరం అబ్జర్వర్‌ సి.శరవణన్‌ మాట్లాడుతూ పోలీసు అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండి సాంకేతిక నైపుణ్యన్నీ ఉపయోగించుకొని పనిచేయాలని, ఎన్నికలు ప్రశాంత, స్వేచ్చాయుత వాతావరణంలో ప్రజలు అందరు తమ ఓటుహక్కును ఉపయోగించుకొనే విధంగా వారికి అవసరమైన చర్యలను తీసుకోవాలని సూచించారు. ఎలక్షన్‌కు సంబంధించిన చిన్న సంఘటన జరిగినా, ఫిర్యాది వచ్చిన వీడియోగ్రాఫ్‌, సీసీ కెమెరాలు, సీసీ కెమెరా ఫుటేజ్‌ డాక్యుమెంటేషన్‌ తప్పనిసరిగా ఉండాలని, అధికారులందరూ చాలా జాగ్రత్తగా అప్రమత్తతతో పనిచేయాలని సూచించారు. ప్రతి స్టేషన్‌ పరిధిలో ఉన్న పోలింగ్‌ బూత్‌లను ఎల్లపుడు సందర్శిస్తూ, స్థానికులతో సత్సంబంధాలు కలిగి యుండాలని తెలిపారు. అధికారులు ఇన్‌ఫర్మేషన్‌ వ్యవస్థను రూపొందించుకోవాలని సూచించారు. శాంతి భద్రతలకు భంగం కలిగించేలా ప్రవర్తించే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని తెలిపారు. ఎన్నికలు ప్రశాంతంగా, ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా నిర్వహించేందుకు, ప్రతి పోలీసు అధికారి పక్కా ప్రణాళికతో సిద్ధంగా వుండాలని సూచించారు. ఈ సమావేశంలో రాజన్న సిరిసిల్ల జిల్లా ఎన్నికల సమన్వయ అధికారి బి.గౌతంరెడ్డి పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!