ఎన్నికల సాధారణ పరిశీలకులుగా శరవణన్
జిల్లాలో జరగనున్న ఎంపిటిసి, జడ్పీటిసి ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం ఇండియన్ ఫారెస్ట్ అధికారి సి.శరవణన్‌ను రాజన్న సిరిసిల్ల జిల్లాకు సాధారణ పరిశీలకులుగా నియమించినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పి.వెంకట్రామరెడ్డి తెలిపారు. బుధవారం ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లా ప్రజలు ఎంపిటిసి, జడ్పీటిసి ఎన్నికలకు సంబంధించి ఏమైనా సమస్యలు, ఫిర్యాదులు ఉంటే ఎన్నికల సాధారణ పరిశీలకులు సి.శరవణన్ మొబైల్ నంబర్ 9440810105లో సంప్రదించాలని జిల్లా ఎన్నికల అధికారి పి.వెంకట్రామరెడ్డి ప్రజలకు సూచించారు. జిల్లాలో ఎన్నికలు ముగిసేంత వరకు సాధారణ పరిశీలకులు ఫోన్‌లో అందుబాటులో ఉంటారన్నారు. ఈ అవకాశాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.