ఆందోళనలో రైతులు
జమ్మికుంట: నేటి ధాత్రి
విద్యుత్ వైర్లు పంట పొలంలో ఉండడంతో వ్యవసాయం చేసుకోలేకపోతున్నామని వీణవంక మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన రైతులు వాపోతున్నారు. ఈసందర్భంగా రైతులు పొలంలో కరంట్ నారుమడిలో ఉండడంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పని చేయాల్సి వస్తుంది అని అన్నారు. పలుమార్లు సంబంధిత అధికారులకు సమస్యపై తెలిపిన పట్టించుకోలేదని తెలిపారు. కరెంటు వైర్లు కిందికి వేలాడడంతో రైతన్నలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. రైతుల పొలంలోకి హార్వెస్టర్లు ట్రాక్టర్లు వెళ్లాలన్న ఇబ్బంది పడుతూ ప్రమాదమని తెలిసినా వెళ్లక తప్పడం లేదని రైతుల ఆవేదం వ్యక్తం చేస్తున్నారు. పలుమార్లు ఈ విషయంపై ప్రజాప్రతినిధులకు ట్రాన్స్కో అధికారులకు తెలిపినప్పటికీ పట్టించుకోవడంలేదని రైతులు తెలిపారు. రాత్రి సమయాల్లో పొలాలకు వెళ్లాలంటే భయపడుతున్నామని ఇప్పటికైనా అధికారులు స్పందించి పంట పొలాలలో ఉన్న లూస్ వైర్లను మరమ్మత్తు చేయాలని కోరారు.