జమ్మికుంట: నేటి ధాత్రి
ఇల్లందకుంట గ్రామంలో శ్రీ దేవి శరన్నవరాత్రులు ఉత్సవాల్లో భాగంగా మహా చండీ యాగమును ఘనంగా నిర్వహించారు. దేవీ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా సోమవారం అమ్మవారిని మహా చండికాదేవి అలంకరణ చేసి అమ్మవారి దగ్గర గుమ్మడి కాయ పూజలను నిర్వహించారు. భవాని మాలధారులు మహా చండీయాగం లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు . గ్రామంలోని ప్రజలందరూ మహా చండీయాగానికి హాజరై అమ్మవారికి మొక్కలు చెల్లించుకున్నారు . అదేవిధంగా మండలంలోని శ్రీరాములపల్లి గ్రామంలో గత తొమ్మిది సంవత్సరాలగా దుర్గామాత శరన్నవరాత్రి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. గ్రామంలోని ప్రజలు రైతులు సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని మొక్కుకుంటూ పలువురు మాలధారణ చేశారు. జమ్మికుంట పట్టణంలోని మోత్కులగూడెం మహంకాళి యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన దేవీ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మహా అన్నప్రసాద వితరణ నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారికి ముక్కులు చెల్లించుకోవడంతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు.